మనిషికి పంది గుండె అమర్చిన వైద్యులు..!

వైద్య శాస్త్రంలో వినూత్న ప్రయత్నం జరిగింది. మనిషికి పంది గుండెను విజయవంతంగా అమర్చారు అమెరికా వైద్యులు. జన్యుమార్పిడి చేసిన పంది గుండెను ఓ హార్ట్ పేషెంట్ కి ట్రాన్స్ ప్లాంట్ చేశారు. మేరీల్యాండ్ కి చెందిన డేవిడ్ బెన్నెట్ అనే అవ్యక్తి ఈ ఆపరేషన్ చేశారు. మనిషికి పంది గుండెను అమర్చడం ప్రపంచంలోనే ఇది తొలిసారి.. 

మేరీల్యాండ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ వైద్యులు 57 ఏళ్ల బెన్నెట్ కి ఈ సర్జరీ చేశారు. సుమారు 8 గంటల పాటు కష్టపడి ఈ శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. ఈ గుండె మార్పిడి ద్వారా వైద్య రంగంలో పెను మార్పులను తీసుకొస్తుందని వైద్యులు ఆశిస్తున్నారు. రాబోయే రోజుల్లో అవయవదానాల కొరతను అధిగమించవచ్చని పేర్కొన్నారు. 

గతంలో మనిషికి పంది కిడ్నీలను పెట్టి వైద్యులు విజయం సాధించారు. తాజాగా గుండె మార్పిడిని విజయవంతం చేశారు. అయితే గుండె మార్పిడి జరిగిన వ్యక్తి పూర్తిగా కోలుకునే వరకు వైద్యుల పర్యవేక్షణలో ఉంటాడని డాక్టర్లు తెలిపారు. మానవునిలో పంది గుండె ఎలా పనిచేస్తుందనడాన్ని నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు.  

 

Leave a Comment