ఆలస్యంగా నిద్ర లేచే వారికి ఆ ముప్పు..టీనేజర్స్ లో ఆ ఆరోగ్య సమస్యలు..!

లేట్‌గా పడుకుని లేట్ గా నిద్ర లేవడం మామూలు విషయంగానే కనిపించొచ్చు కానీ ఇది ఆరోగ్యం మీద, మనిషి లైఫ్ స్టైల్ మీద  చాలా మార్పులు తీసుకొస్తుందని  పరిశోధకులు అంటున్నారు. టీనేజ్‌లో స్థూలకాయం ఒక అంటువ్యాధిగా మారుతోంది. అందువల్ల ఆహారంతో పాటు, నిద్ర విధానాలపై కూడా శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం.సాధారణంగా మనిషి జీవన శైలిలో తినడానికి పడుకోవడానికి ఉదయం నిద్ర లేవడానికి కూడా ఒక సమయం సందర్భం అంటూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. 

కానీ ఈ రోజుల్లో మాత్రం సమయం అంటూ ఏదీ లేదు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు తినడం ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు పడుకోవడం . ఇక ఇష్టం వచ్చినప్పుడు లేవడం  లాంటివి అందరూ చేస్తున్నారు. ఉదయం త్వరగా నిద్రలేచి రాత్రి త్వరగా నిద్రపోవాలని మన పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. మన పెద్దలు చెప్పిన ఈ విషయాన్ని ఇప్పుడు సైన్స్ కూడా నిజమని తేల్చేసింది. ప్రతి రోజూ ఉదయం ఆలస్యంగా మేల్కొనే టీనేజర్లు మధుమేహంతో సహా ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని బ్రిఘం యంగ్ యూనివర్శిటీ ఆఫ్ అమెరికా కొత్త అధ్యయనం పేర్కొంది. 

ఇలాంటి వాళ్లు అలసిపోయినప్పుడు చక్కెరను ఎక్కువగా తీసుకుంటారట. పరిశోధకులు ఒక వారం పాటు ఇలాంటి ఆహారపు విధానాలను విశ్లేషించారు. అలసిపోయిన యువకులు ఒక రోజులో సగటున 12 గ్రాముల చక్కెరను ఎక్కువగా తింటారని పరిశోధకుల అధ్యయనంలో తేలింది. అలా ఒక సంవత్సరంలో 2.5 నుండి 3 కిలోల చక్కెర అదనపు శరీరానికి చేరుకుంది.

14 నుంచి 17 ఏళ్లలోపు టీనేజర్స్ పై జరిపిన ఈ టెస్టులోని ఫలితాలు ‘స్లీప్’ జర్నల్‌లో ముద్రించపడ్డాయి. మనం తినే దాని కంటే మనం ఏమి తింటున్నాము అనేదే ప్రదానము, అని ఈ అధ్యయనం  రచయిత డాక్టర్ కారా డురాసియో చెప్పారు. చక్కెర స్థాయిని పెంచే ఆహారాన్ని తీసుకుంటే,  శక్తి సమతుల్యతపై ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని తెలిపారు.ఇది కొవ్వు పేరుకుపోవడాన్ని కూడా పెంచుతుంది. దీని కారణంగా బరువు వేగంగా పెరుగుతుంది. ఈరోజుల్లో టీనేజర్లలో బరువు పెరిగే సమస్యకు ఇది కూడా ఒక ప్రధాన కారణం.  వీటిలో గుండెపోటు, స్ట్రోక్, అధిక రక్తపోటు మరియు మధుమేహం ఉన్నాయి. 

టీనేజ్ లో ఉన్నపుడు యువకులు అలసిపోయిన వెంటనే శక్తి కావాలి అని కోరుకున్నటారు అని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయని డాక్టర్ డ్యూరాసియో అన్నారు. ఈ సమయంలో  వీళ్లు అనారోగ్యకరమైన వాటిని తింటారని చెప్పారు. ఈ అధ్యయనానికి సంబంధించిన విషయం అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్‌లో కూడా చెప్పారు. దీని ప్రకారం ఎక్కువ నిద్రపోవడం  వల్ల గుండె జబ్బుల ప్రమాదం ఉంటుంది. ఈ సర్వే ప్రకారం, 9 నుండి 11 గంటలు నిద్రపోయే వ్యక్తులు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 38 శాతం ఎక్కువ అవుతుంది.

 

Leave a Comment