N-95 మాస్కులను శుభ్రం చేసుకోవచ్చట.. ఎలాగో తెలుసా..!

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్ల విజ్రుంభిస్తున్నాయి. దీంతో చాలా రాష్ట్రాలు కరోనా ఆంక్షలు అమలు చేస్తున్నాయి. భౌతిక దూరం పాటించడం, మాస్కులను తప్పనిసరిగా ధరించాలని ఆదేశిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ కూడా అమల్లో ఉంది. బస్సుల్లో, రైళ్లలో ప్రయాణించాలంటే మాస్క్ తప్పనిసరిగా ధరించాలి.. మాస్క్ వేసుకోకుండా జరిమానా విధించాలని రాష్ట్రాలు నిర్ణయించాయి. 

ఇక కొత్త వేరియంట్లను అరికట్టాలంటే క్లాత్ మాస్కులు సరిపోవని నిపుణులు చెబుతున్నారు. ఈక్రమంలో ఎన్-95 మాస్కులు కరోనా నుంచి రక్షణ కల్పిస్తాయని అంటున్నారు. అయితే ఈ ఎన్-95 మాస్కుల ధర ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఈ మాస్కులను శుభ్రం చేసే అవకాశం కూడా లేకపోవడంతో నిర్దిష్ట సమయం వాటిని వాడి పారేయాల్సి వస్తుంది. 

ఈ ఇబ్బందిని దూరం చేసేందుకు అమెరికా నిపుణులు ఒక కొత్త పద్ధతిని కనిపెట్టారు. ఈ పద్ధతి పాటిస్తే ఎన్ -95 మాస్కులను 25 సార్లు శుభ్రం చేసి తిరిగి వాడవచ్చని చెబుతున్నారు. ఇలా వాడితే ఈ మాస్కుల రక్షణ సామర్థ్యం కూడా ఏ మాత్రం తగ్గదట.. అందుకోసం అమెరికాలోని బెథ్ ఇజ్రాయెల్ డీకోనెస్ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తలు సాధాణ క్రిమినాశక రసాయనం వేపరైజ్డ్ హైడ్రోజన్ పెరాక్సైడ్(వీహెచ్పీ)ని తీసుకొచ్చారు. దీని సహాయంతో ఎన్-95 మాస్కులను శుభ్రం చేయవచ్చిని, 25 సార్లు శుభ్రం చేసినా మాస్క్ పటిష్టత, సమర్థత తగ్గలేదని తేల్చారు.  

 

Leave a Comment