అఫ్ఘనిస్తాన్ వెళ్లిండి.. పెట్రోల్ తక్కువ ధరకు వస్తుంది : బీజేపీ నేత 

దేశవ్యాప్తంగా పెట్రో ధరలు మంటపుట్టిస్తున్నాయి. దాదాపు అన్ని నగరాల్లోనూ లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటేసింది. దీంతో సామాన్యులు పెరిగిన పెట్రోల్ ధరలతో అల్లాడిపోతున్నారు. తాజాగా ఇంధన ధరలపై ఓ బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత రామ్ రతన్ పాయల్ ని జర్నలిస్టులు ఇంధన ధరలపై ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘తాలిబన్ పాలిన ప్రాంతానికి వెళ్లండి.. అఫ్ఘనిస్తాన్ లో పెట్రోల్ రూ.50కే దొరుకుతుంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇంధన ధరలకు బదులుగా కోవిడ్ మూడో వేవ్ గురించి ఆలోచించాలని జర్నలిస్టుకు సూచించారు. 

అయితే ఈ కార్యక్రమంలో రామ్ రతన్ పాయల్, మరికొంత మంది బీజేపీ కార్యకర్తలు ఎవరూ మాస్కులు ధరించలేదు. బీజేపీ నేత తీరుపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. తప్పులను కప్పి పుచ్చుకునేందుకు ఇలా చౌకబారు మాటలు మాట్లాడుతున్నారని మండిపడింది. 

Leave a Comment