వ్యాక్సిన్ వేసుకున్న డెల్టా వేరియంట్ సోకుతుంది: ఐసీఎంఆర్ రిపోర్ట్

ప్రపంచం మొత్తాన్ని కరోనా మహమ్మారి గడగడలాడిస్తోంది. వివిధ వేరియంట్లలో రూపాంతరం చెందుతూ భయాందోళనలకు గురిచేస్తోంది. ఇప్పటికే అనేక దేశాల్లో వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరుగుతోంది. వ్యాక్సిన్ వేసుకోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారినపడకుండా, మరణాలు ఎక్కువగా నమోదు కాకుండా ఉన్నారు. 

అయితే కరోనా కొత్త వేరియంట్ డెల్టాపై అందరికీ భయాందోళనలు ఉన్నాయి. ఎందుకంటే వ్యాక్సిన్ వేసుకున్నా కూడా డెల్టా వేరియంట్ బారిన పడే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ(ఐసీఎంఆర్) కూడా ఇదే చెబుతుంది. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమాలజీ ప్రకారం.. ఐసీఎంఆర్ అనుమతించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 

ఈ మేరకు చెన్నై జర్నల్ లో ఆగస్టు 17వ తేదీన ప్రచురితమైంది. ఈ అధ్యయనం ప్రకారం సెకండ్ వేవ్ కి కారణమైన డెల్టా వేరియంట్, అటు వ్యాక్సిన్ తీసుకోని వాళ్లతో పాటు, తీసుకున్న వారికి కూడా సోకే అవకాశం ఉందని, కాకపోతే వైరస్ ప్రభావంలో మార్పు ఉంటుందని వెల్లడించింది. 

ఈ అధ్యయనంలో భాగమైన జీరోమ్ తంగిరాజు అనే శాస్త్రవేత్త ప్రకారం, అధ్యయనం చేసిన శాంపిల్స్ చాలా తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఏదీ ఏమైనా వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ డెల్టా వేరియంట్ బారిన పడే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల కరోనా నియమాలను కచ్చితంగా పాటించాలని, అజాగ్రత్తగా ఉండకుండా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

Leave a Comment