శ్రీలంక బాటలో బంగ్లాదేశ్.. భారీగా పెరిగిన పెట్రోల్ ధరలు..!

శ్రీలంకలో ఏర్పడిన సంక్షోభం గురించి అందరికీ తెలిసిందే.. అక్కడ ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. నిత్యావసరల వస్తువుల ధరలు భారీగా పెరగడంతో ప్రజలు ఆందోళన చేశారు. ఇప్పుడు అదేబాటలో మరో దేశం ప్రయాణిస్తోంది.. ఇంధన సంక్షోభం సుడి గుండంలో ఇప్పుడు బంగ్లాదేశ్ చిక్కుకుంది.. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగ్లాదేశ్ లో చమురు ధరలు 52 శాతం పెరిగాయి.. 1971లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ స్థాయిలో ధరలు పెరగడం ఇదే తొలిసారి అని ఫ్రీ ప్రెస్ జర్నల్ వెల్లడించింది. 

 

తక్కువ ధరలకు ఇంధనాన్ని విక్రయించడం ద్వారా ఫిబ్రవరి నుంచి జూలై మధ్య భారీగా నష్టపోయినట్లు బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం కొత్త రేట్లు ప్రకటించడంతో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టారు. దీంతో ఢాకాలోని మహ్మద్ పూర్, అగర్ గావ్, మాలీబాగ్ తో పాటు మరిన్ని ప్రాంతాల్లోని అనేక పెట్రోల్ బంకులు తమ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేశాయి.. పెట్రోల్ ధరలు లీటర్ కి 51.7 శాతం పెరిగి 135 టాకాలకు చేరడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

Leave a Comment