‘నా సెక్స్ లైఫ్ గొప్పగా లేదు’.. ‘కాఫీ విత్ కరణ్ షో’పై తాప్సీ సంచలన కామెంట్స్..!

బాలివుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్ కరణ్ సీజ్-7’పై సొట్టబుగ్గల బ్యూటీ తాప్సీ పన్ను సంచలన కామెంట్స్ చేసింది. ఏదైనా సినిమా రిలీజ్ టైమ్ దగ్గర ఉంటే.. ఆ సినిమా హీరో, హీరోయిన్లు ప్రమోషన్లు చేస్తుంటారు. ప్రమోషన్లలో భాగంగా వారిని కాఫీ విత్ కరణ్ షోలో ఆహ్వానిస్తుంటారు.. ఈ షోలో కరణ్ జోహార్ తన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటారు. ముఖ్యంగా వారి సెక్స్ లైఫ్ గురించి ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెడుతుంటారు. 

 

అయితే ఈ షోకు తాప్సీకి ఆహ్వానం అందలేదు.. తాప్సీ నటించిన దోబారా సినిమా ఆగస్టు 19 విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆమె బిజిగా ఉంది. ఈ సందర్భంగా ఆమెకు కరణ్ షోకు ఆహ్వానం అందకపోవడంపై ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్నలకు ఆమె సూటిగా సమాధానం చెప్పింది.. ‘కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొనేంత గొప్పగా నా శృంగార జీవితం లేదు. అందుకే ఆ షోలో పాల్గొనలేదు’ అంటూ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం తాప్సీ చేసిన ఈ కామెంట్స్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. 

 

Leave a Comment