ఇకపై స్కూళ్లలో ఖోఖో, కర్రాబిళ్ల ఆటలు..!

విద్యార్థులు చిన్నతనం నుంచే భారతీయ సంస్కృతి, కళలు, ఆటలు, శాస్త్రాల గురించి తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇకపై పాఠశాలల్లో క్రీడలను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల్లో విద్యార్థులకు ఖోఖో, కర్రాబిళ్లు ఆటలను తప్పనిసరిగా ఆడించాలని ఆదేశించింది. దీంతో పాటు 75 ఆటలను పాఠశాలల్లో ఆడించాలని సూచించింది. 

 

ఆటలతో పిల్లల్లో మానసిక ఉల్లాసం కలుగుతుందని, మానసిక ఒత్తడి తగ్గి చదువుపై ఉత్సాహం కలుగుతుందని కేంద్ర విద్యాశాఖ తెలిపింది. అందుకోసం పాఠశాలల్లో కర్రాబిళ్ల, పతంగులు ఎగురవేయడం, కుంటుడు, సంతాళ్ వంటి ఆటలు ఆడించాలని చెప్పింది. రానురాను ఈ ఆటలకు ప్రాముఖ్యత తగ్గిపోయిందని, ప్రతి పీఈటీ ఈ ఆటలను విద్యార్థులకు నేర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు ఆయుర్వేద, లోహ శాస్త్రాలను పాఠ్యాంశాల్లో చేర్చాలని కేంద్ర విద్యాశాఖ భావిస్తోంది.. 

Leave a Comment