ఇదేం ఆఫర్ రా బాబూ.. మొబైల్ కొంటే పెట్రోల్, నిమ్మకాయలు ఉచితం..!

కస్టమర్లను ఆకర్షించేందుకు వ్యాపారులు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తుంటారు.. అందులో భాగంగా వారణాసికి చెందిన ఓ మొబైల్ స్టోర్ యజమాని వినూత్న ప్రచారం మొదలుపెట్టాడు. కస్టమర్లను ఆకర్షించేందుకు సరికొత్త ప్రచారానికి తెరతీశాడు. మరీ ఆ ఆఫర్లు ఏంటో చూద్దామా.. 

వారణాసిలోని మొబి వరల్డ్ షాప్ సమ్మర్ స్పెషల్ ఆఫర్లు ప్రకటించింది. తమ వద్ద రూ.10 వేలకు పైగా విలువైన ఫోన్ కొంటే లీటర్ పెట్రోల్ ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. మొబైల్ యాక్సెసరీస్ పై 5 నిమ్మకాయలు ఉచితంగా అందిస్తామని మొబి వరల్డ్ షాప్ ప్రకటన చేసింది. 

ప్రస్తుతం ఈ ప్రకటన అందర్నీ ఆకర్షిస్తోంది.. ఈ ఆఫర్ ఎంటా అని తెలుసుకునేందుకు షాప్ కి జనాలు క్యూ కడుతున్నారు. ఆఫర్ ప్రకటనతో అమ్మకాలు బాగున్నట్లు షాప్ నిర్వాహకులు చెబుతున్నారు. మార్కెట్ లో పెట్రోల్, నిమ్మకాల రేట్లు పెరిగిపోవడంతో వాటిని ఉచితంగా అందిస్తామని ప్రకటించినట్లు తెలిపారు. 

Leave a Comment