రాళ్లు విసిరాడని చేతుల్లేని వ్యక్తిపై కేసు..!

వ్యవస్థ చట్టాన్ని వదిలిపెట్టి, నియంతృత్వానికి బానిసైతే ఎలా ఉంటుందో తెలిపే ఘటన ఇది.. రామనవమి ఊరేగింపు సందర్భంగా మధ్యప్రదేశ్ లోని ఖర్గోన్ జిల్లాలో అర్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే.. ఈ అల్లర్లలో ఇరువర్గాలకు చెందిన వారు రాళ్లు విసురుకున్నారు. రాళ్లు విసిరిన ముస్లిం వ్యక్తుల ఇళ్లను అక్కడి ప్రభుత్వం ధ్వంసం చేసింది.. 

అక్కడి పోలీసులైతే మరీ వింతగా ప్రవర్తించారు. నిందితుల జాబితాలో వసీం షేక్ అనే వ్యక్తి పేరుకు చేర్చి అతడిపై కేసు నమోదు చేశారు. అంతేకాదు అతడి జీవనాధారమైన దుకాణాన్ని కూడా కూల్చేశారు.. ఇందులో వింత ఏముందని అనుకుంటున్నారా.. అవును వింతే.. ఎందుకంటే.. వసీం షేక్ 2005 లో జరిగిన ఓ ప్రమాదంలో రెండు చేతులు పోగొట్టుకున్నాడు. 

వసీం 2005లో కరెంట్ షాక్ వల్ల రెండు చేతులు కోల్పోయాడు. అప్పటి నుంచి చిన్న దుకాణం పెట్టుకుని కుటుంబాన్ని పోషించేవాడు. అసలు నిందితులు ఎవరో పట్టుకోకుండా..కేవలం ముస్లిం అయినందు వల్ల రెండు చేతులు లేని వసీం షేక్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఊరేగింపుపై రాళ్లు విసిరాడని బుల్డోజర్ తో అతడి జీవనాధారమైన దుకాణాన్ని కూల్చేశారు. ఈ ఘటనపై అక్కడి ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి.   

Leave a Comment