వింత గ్రామం.. అక్కడ ఎవ్వరూ బట్టలు వేసుకోరు..!

అదొక వింత గ్రామం. అక్కడున్న వారెవరూ బట్టలు ధరించరు. ప్రపంచంలో ఇలాంటి గ్రామం ఒకటి ఉందా అని ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే.. అక్కడున్న వారందరూ కోటీశ్వరులే.. కానీ బట్టలు మాత్రం ధరించరు. పర్యటకులకు కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. ఎక్కడో తెలుసుకోవాలని ఉందా..

యూకేలోని హెర్ట్ పోర్డ్ షైర్ లో ఓ గ్రామం. ఈ గ్రామం పేరు స్పీల్ ప్లాట్జ్. ఈ గ్రామ ప్రజలు దాదాపు 85 సంవత్సరాల నుంచి బట్టలు లేకుండా జీవిస్తున్నారు. అయితే అక్కడ నివసించే వారు ఉన్నత చదువులు చదువుకున్న వారే.. కావాల్సినంత సంపద కూడా ఉంది. అయినా ఇక్కడ మహిళలు, పురుషులు, వృద్ధులు, పిల్లలు అందరూ బట్టలు లేకుండా ఉంటారు. గొప్ప విషయం ఏమిటంటే అక్కడున్న వారు దీనిని అసౌకర్యంగా భావించరు. 

ఈ గ్రామాన్ని 1929వ సంవత్సరంలో ఇసుల్ట్ రిచర్డ్స్న్ కనుగొన్నారు. అతడు ఈ గ్రామాన్ని కనుగొన్నప్పుడు తన మిగితా జీవితాన్ని ఈ గ్రామంలో గడపాలని నిర్ణయించుకున్నాడట..ఈ గ్రామంలో పబ్ స్విమ్మింగ్ పూల్, క్లబ్ కూడా ఉంది. అక్కడున్న వారు మాత్రమే కాదు పర్యటకులు కూడా ఈ రూల్స్ తప్పనిసరిగా పాటించాలి. 

అయితే ఈ గ్రామం వారు ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాత్రం దుస్తులు ధరిస్తారు. తిరిగి వచ్చిన వెంటనే బట్టలు లేకుండా మారిపోతారు. అంతేకాదు ఇక్కడి ప్రజలు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఎవరైనా ఇతర కారణాల వల్ల దుస్తులు ధరించాలనుకుంటే వారికి ఎలాంటి అభ్యంతరం మాత్రం చెప్పరు. బట్టలు లేకుండా కనిపించేందు వారు సిగ్గు పడరు. 

Leave a Comment