ఈ అలావాట్లు మీ బ్రెయిన్ ను బ్లాక్ చేస్తాయి.. అవి ఏంటంటే..!

మానవునిలో మెదడు తలభాగంలో కపాళంచే రక్షించబడి ఉంటుంది. జ్ఞానేంద్రియాలన్నింటికీ మెదడు ముఖ్యమైన కేంద్రం. మెదడుకు తనంతట తానే సొంతంగా మరమ్మతులు చేసుకోగలిగే సామర్థ్యం ఉంటుంది. మెదడుకు ఏం చేయాలో ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం, గత విషయాలు గుర్తు పెట్టుకోవడం వంటి లక్షణాలు ఉంటాయి. మెదడు చురుగ్గా ఉంటే శరీరం కూడా చురుగ్గా ఉంటుంది. ఇంత చురుగ్గా ఉండే మెదడుపై మనం చేసే కొన్ని పనుల వల్ల ప్రభావం పడుతుంది. మీరు అలాంటి తప్పులు చేస్తుంటే వాటిని వెంటనే సరిదిద్దుకోండి.. 

మెదడుపై ప్రభావం పడే అంశాలు:

  • సరిగ్గా నిద్రపోకపోవడం, ఎక్కువగా నిద్ర పోవడం రెండు మెదుడుపై ప్రభావం చూపుతాయి. సరైన నిద్ర లేకపోతే మెమోరీ పవర్ తగ్గిపోతుంది. ఎక్కువ కాలం ఇలా చేయడం వల్ల దీని ప్రభావం ప్రమాదకరం అవుతుంది. 
  • నోరు మూసుకుని నిద్ర పోవడం కూడా అనర్థాలకు దారితీస్తుంది. ఇలా చేయడం వల్ల బ్రెయిన్ సెల్స్ పెరిగిపోతాయి. అదేవిధంగా కార్బన్ డయాక్సైడ్ పెరిగి ఆక్సిజన్ తగ్గిపోతుంది. 
  • అతిగా తినడం, మనం తీసుకునే డైట్ కూడా బ్రెయిన్ పైన డైరెక్టుగా ప్రభావం పడుతుంది. ఎక్కువ తినడం వల్ల బ్రెయిన్ చేసే పనిపైన ప్రభావితం చేస్తుంది. 
  • చిన్నచిన్న విషయాలకు అతిగా రియాక్ట్ అవడం వల్ల కూడా ఇబ్బందులు కలుగుతాయి. కోపంతో ఎక్కువగా రియాక్ట్ అవడం వల్ల బ్రెయిన్ లో ఉండే బ్లడ్ వెసెల్స్ గట్టిగా అయిపోతాయి. దీని వల్ల మెదడు పని మీద ప్రభావం పడుతుంది. 
  • ఉదయాన్నే మనం బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోవడం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి తప్పకుండా ఉదయాన్నే అల్పాహారం తీసుకోవాలి. ఎక్కువ కాలం పాటు అనారోగ్య సమస్యలు ఉన్నా లేదా మానసిక ఇబ్బందులు ఉన్నా సరే బ్రెయిన్ సమస్యలు వస్తాయి. 

Leave a Comment