ప్రజలు ఛీ కొడుతున్నారు..

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ ద్వారా చంద్రబాబుపై మరోసారి విమర్శలు చేశారు. ‘సమాంతర పాలన భ్రాంతిలో బాబు గారు మునిగి తేలుతున్నారు. ద్రవ్య వినిమయ బిల్లును కౌన్సిల్ లో అడ్డుకోవడం ద్వారా తాత్కాలిక ఆనందం పొందారు. ఇలాంటి ఉపశమనాలతో బండి లాక్కొస్తున్నారు. వీడియోలు తీసి సభా మర్యాదులు ఉల్లంఘించిన కుమారుడు విప్లవ యోధుడిలా కనిపించి ఉంటాడు. ప్రజలు ఛీ కొడుతున్నారు’ అంటూ ట్విట్ చేశారు. 

మరొ ట్విట్ లో ‘తమ పార్టీ నేతలు వందల కోట్ల కుంభకోణాలు, ఫోర్జరీ, మోసం కేసుల్లో అరెస్టయితే సిగ్గు పడాల్సింది పోయి, మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని బెదిరిస్తున్నారు నాయుడు బాబు. స్వార్థ బుద్ధితో నేరాలకు పాల్పడి కేసుల్లో ఇరుక్కున్న వారికి హక్కుల భంగం ఎలా కలిగిందో ప్రజలకు జవాబు చెప్పాలి’ అంటూ విమర్శించారు. 

Leave a Comment