పీనట్ బటర్ వల్ల ఆ సమస్యలు దూరం..ఆరోగ్య ప్రయోజనాలివే !!

పీనట్ బటర్ అంటే చాలా మందికి ఇష్టం. చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకూ పీనట్ బటర్ ను తెగ ఇష్టపడుతుంటారు. ఈ పీనట్ బటర్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పీనట్ బటర్ లో మోనో అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్, ప్రొటీన్ బాగా ఉంటాయి. అవి త్వరగా కడుపును నింపేలా చేస్తాయి. వెయిట్ లాస్ కోసం పీనట్ బటర్ తినేవారు బ్రేక్స్ ఫాస్ట్‌లో టోస్ట్ మీద అరటిపండు, చియా సీడ్స్‌తో తినవచ్చు. లంచ్‌లో క్రష్ చేసిన హోల్ రాస్ప్బెర్రీస్‌తో పాటు శాండ్విచ్‌కి యాడ్ చేసుకుని తింటే చాలా రుచికరంగా ఉంటుంది. పీనట్ బటర్ ను యాపిల్‌తో పాటు కలిపి స్నాక్‌లా తీసుకోవచ్చు. పీనట్ బటర్ ని ఎప్పుడూ తగిన మోతాదులోనే తీసుకోవాలి. రోజు మొదట్లో కానీ, మిడ్ మార్నింగ్ టైమ్‌లో కానీ ఎక్కువ ఎనర్జీని పీనట్ బటర్‌ ఇస్తుంది. ఇందులో ఉన్న ప్రోటీన్, ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్ ఇస్తాయి. అంతే కాకుండా పీనట్ బటర్ బ్లడ్ షుగర్‌ని సమతుల్యంగా ఉంచుతుంది.

penut buttor

శరీరానికీ రోజూ మూడు వందలకి పైగా బయో కెమికల్ ఫంక్షన్స్‌కి మెగ్నీషియం అవసరం ఉంటుంది. ఈ న్యూట్రియెంట్ తలనొప్పి, మజిల్ క్రాంప్స్, నీరసాన్ని తగ్గిస్తుంది. పీనట్ బటర్‌లో మెగ్నీషియం ఉండటం వల్ల అది శరీర టెంపరేచర్ ని రెగ్యులేట్ చేస్తుంది. డీటాక్స్ చేస్తుంది, ఎనర్జీ‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎముకలూ పళ్ళూ బలంగా ఉండేలా చేస్తుంది. నరాలను ఆరోగ్యకరంగా ఉండేలా చేస్తుంది. పీనట్ బటర్‌లో విటమిన్ ఈ పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ ఈ హార్ట్ డిసీజ్, క్యాన్సర్లు, ఐ డిసార్డర్స్‌ని ప్రివెంట్ చేస్తుంది. స్కిన్‌ని ఫ్రీ ర్యాడికల్ డ్యామేజ్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. స్కిన్‌కి మంచి గ్లో వచ్చేలా చేస్తుంది.

పీనట్ బటర్ తీసుకోవడం వల్ల హార్ట్ డిసీజ్, డయాబెటీస్ వచ్చే రిస్కులని తగ్గిస్తుంది. అకాల మరణం సంభవించే రిస్క్‌ని కూడా రెడ్యూస్ చేస్తుంది. మజిల్స్ హెల్దీగా ఉండాలంటే పొటాషియం అవసరం. పీనట్ బటర్‌లో పొటాషియం ఉంటుంది. ఇది ఇంకా కండరాల నొప్పులని తగ్గిస్తుంది, మజిల్ క్రాంప్స్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. పీనట్ బటర్ లో ఉండే పొటాషియం బ్లడ్ ప్రెజర్ ని తగ్గించడం లో కూడా హెల్ప్ చేస్తుంది. అయితే, బ్లడ్ ప్రెజర్ తగ్గడం కోసం పీనట్ బటర్ వాడే వారు ఉప్పు కలపని బటర్ తీసుకోవాలి.

పీనట్ బటర్ లో ఉండే ట్రిప్టోఫాన్ అనే ఎమైనో యాసిడ్ స్లీప్ హార్మోన్స్ కి హెల్ప్ చేస్తుంది, కాబట్టి దీన్ని నైట్ టైమ్ స్నాక్ గా తీసుకోవడం వల్ల మంచిగా నిద్ర పడుతుంది. పీనట్ బటర్ ఎంత మంచిదైనా కూడా తగు మోతాదులోనే తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే బరువు పెరగడంతో పాటు మరి కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. పీనట్ బటర్ జార్‌ని ఎప్పుడు జార్ మూత కిందకి ఉండేలా స్టోర్ చేయాలి. అప్పుడే, జార్ ఓపెన్ చేయగానే మనకి ఆయిల్ కనిపించకుండా ఉంటుంది. బటర్ కూడా పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంటుంది.

Leave a Comment