నిద్ర సమస్యలతో బాధపడేవారికి అలర్ట్..ఈ ఆహారాల జోలికి అస్సలు వెళ్లొద్దు!

ప్రపంచంలో చాలా మంది నిద్ర సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఆకలినైనా తట్టుకునే శక్తి ఉంటుందికానీ నిద్ర లేకపోతే తట్టుకోవడం కష్టం. అందుకే ప్రతి మనిషికి కూడా తగినంత నిద్ర అనేది ఉండాలి. నిద్ర సమస్యలతో ఉన్నట్టైతే వైద్యులను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం ఎంతో ఉత్తమం. సరైన ఆహారం, వ్యాయామంతో నిద్ర సమస్యలను పోగొట్టుకోవచ్చు. అయితే కొంత మందికి నిద్ర సమస్య అనేది వేధిస్తూ ఉంటుంది. ఆహారం అనేది శరీరానికి కావాల్సిన శక్తి వనరు. అయితే రాత్రిపూట కొన్ని ఆహారాలు తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని ఆహారాలు మీ మంచిగా పట్టే నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. ఆహారం మొత్తం కూడా ముఖ్యం కాబట్టి పడుకునే ముందు పెద్ద మొత్తంలో ఆహారం తీసుకోవడం మంచిది కాదు. పెద్ద మొత్తంలో డిన్నర్ గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లక్స్‌ను పెంచుతుందని వైద్యులు సూచిస్తున్నారు. అది గుండెల్లో మంటను ఇంకా వికారాన్ని కలిగించడమే కాకుండా మంచి నిద్రను దూరం చేస్తుంది. కాబట్టి కడుపు నిండినంత వరకు రాత్రిపూట తినకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రతి ఒక్కరూ వారి వయస్సును బట్టి నిద్ర అనేది పోవాల్సి ఉంటుంది. నవజాత శిశువులు 14 నుంచి 17 గంటల పాటు పడుకోవాలి. అలాగే పిల్లలు 12 నుంచి 15 గంటల పాటు నిద్రించాలి. పసిబిడ్డలు 11 నుంచి 14 గంటలు, పాఠశాల వయస్సు పిల్లలు 9 నుంచి 11 గంటలు, కౌమారదశలో ఉన్నవారు 8 నుంచి 10 గంటలు, యువకులు 7 నుంచి 9 గంటలు, పెద్దలు 7 నుంచి 8 గంటలు కచ్చితంగా నిద్రపోవాలి.

సరైన ఆహారం తినడం వల్ల సరైన నిద్ర పడుతుంది. తప్పుడు ఆహారాలు మీ నిద్రను చెడగొడతాయి. ఆ ఆహారాలు శరీరాన్ని విశ్రాంతి తీసుకోనీయకుండా చేస్తాయి. మీ శరీరాన్ని ఉత్తేజం లేకుండా చేస్తాయి.

బ్రోకలీ, కాలీఫ్లవర్ మరియు క్యాబేజీ వంటి క్రూసిఫెరస్ కూరగాయలు ఆరోగ్యానికి మంచిని చేస్తాయి. అయితే వాటిని పడుకునే ముందు తింటే చాలా ప్రమాదం ఉంటుంది. ఆ కూరగాయలు మంచి నిద్రను దూరం చేస్తాయి. ఆ కూరగాయల్లో ఉండే ఫైబర్ రాత్రి టైంలో జీర్ణించుకునే శక్తిని కోల్పోయేలా చేస్తుంది. అది జీర్ణ సమస్యలకు ప్రేరేపిస్తుంది. అలాంటి ఆహారాన్ని పగటిపూట మాత్రమే తినడం మంచిది.

భోజనం చేసిన తర్వాత పడుకునే ముందు ఐస్ క్రీం తీసుకోవడం చాలా ప్రమాదకరం. అది మీ నిద్రకు ఆటంకం కలిగించడమే కాకుండా జీర్ణం కావడానికి చాలా సమయం తీసుకుంటుంది. ఆహారాన్ని జీర్ణం చేసే సమయంలో శరీరం సరిగ్గా విశ్రాంతిని తీసుకోనీకుండా చేస్తుంది. అంతేకాకుండా అధిక చక్కెర నిద్రకు ఆటంకాన్ని కలిగిస్తుంది. అందుకే రాత్రిపూట ఐస్ క్రీమ్ లకు దూరంగా ఉండటం ఎంతో మంచిది.

టమోటాలలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల రాత్రిపూట టమోటాలను తినడం అంత మంచిది కాదు. వాటిని రాత్రిపూట తిన్నట్టైతే అసిడిటీ మరియు గుండెల్లో మంటకు కారణం అయ్యే అవకాశం ఉంది. చాలా మంది రాత్రిపూట మందు తాగుతారు. ఆల్కాహాల్ నిద్రకు ఆటంకాన్ని కలిగించడమే కాకుండా నిద్ర నాణ్యతపై ప్రభావం చూపుతుంది.

Leave a Comment