ఏపీ కాంగ్రెస్ కు కొత్త కార్యవర్గం

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పీసీసీ) ఆఫీస్‌ బేరర్స్‌, డీసీసీ అధ్యక్షులను ఏఐసీసీ శుక్రవారం ప్రకటించింది. 11 మంది ఉపాధ్యక్షులు, 18 మంది ప్రధాన కార్యదర్శుల పేర్లను ఖరారు చేసింది. 29 మందితో కోఆర్డినేషన్ కమిటీ, 12 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీని ఏర్పాటు చేసింది. 18 మందిని డీసీసీ అధ్యక్షులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల​ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి రాజకీయ వ్యవహారాలు, స​మన్వయ కమిటీల్లో స్థానం కల్పించారు. రాజకీయ వ్యవహారాల కమిటీకి చైర్మన్‌గా పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ వ్యవహరిస్తారు. సమన్వయ కమిటీకి ఊమెన్‌ చాందీ చైర్మన్‌గా ఉంటారు. యూత్‌ కాంగ్రెస్‌, ఎన్ఎస్‌యూఐ, మహిళా కాంగ్రెస్‌, సేవాదళ్‌ చైర్మన్‌లు ఎక్స్‌అఫిషియో సభ్యులుగా వ్యవహరించనున్నారు. పీపీసీ మాజీ అధ్యక్షుడు ఎన్‌. రఘువీరారెడ్డికి కూడా ఈ రెండు కమిటీల్లో స్థానం దక్కింది. మొత్తంగా చూస్తే మహిళలకు తగిన ప్రాధాన్యం లభించలేదు.

డిసీసీ అధ్యక్షులు వీరే..

  1. శ్రీకాకుళం: బొడ్డెపల్లి సత్యవతి
  2. విజయనగరం: సారగడ్డ రమేశ్‌కుమార్‌
  3. అనకాపల్లి: శ్రీరామమూర్తి
  4. కాకినాడ(రూరల్‌): డాక్టర్‌ పాండురంగారావు
  5. అమలాపురం: కొట్టూరి శ్రీనివాస్‌
  6. రాజమండ్రి(రూరల్‌): ఎన్‌వీ శ్రీనివాస్‌
  7. నరసాపురం: మారినేడి శేఖర్‌ (బాబ్జి)
  8. ఏలూరు (రూరల్‌): జెట్టి గురునాథం
  9. మచిలీపట్నం: లామ్‌ తానియా కుమారి
  10. విజయవాడ(రూరల్‌): కిరణ్‌ బొర్రా
  11. నర్సరావుపేట: జి. అలెగ్జాండర్‌ సుధాకర్‌
  12. ఒంగోలు (రూరల్‌): ఈదా సుధాకరరెడ్డి
  13. నంద్యాల: లక్ష్మీనరసింహరెడ్డి
  14. కర్నూలు(రూరల్‌): అహ్మద్‌ అలీఖాన్‌
  15. అనంతపురం(రూరల్‌): ఎస్‌. ప్రతాపరెడ్డి
  16. హిందూపురం: కె. సుధాకర్‌ (మాజీ ఎమ్మెల్యే)
  17. నెల్లూరు (రూరల్‌): దేవకుమార్‌రెడ్డి
  18. చిత్తూరు: డాక్టర్‌ సురేశ్‌బాబు

Leave a Comment