రేషన్ వాహనదారులకు రూ.16 వేలకు బదులు రూ.21 వేలు చెల్లింపు..!

రేషన్ వాహనదారులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. ఇటీవల రేషన్ వాహనదారులు పలు చోట్ల ఆందోళనలకు దిగారు. తమకు ఆదాయం రావడం లేదని, తమకు అన్ని పనులను అప్పజెప్పడంతో తాము రేషన్ ను ఇంటింటికి చేర్చలేమని పేర్కొన్నారు. రేషన్ వాహనదారుల సమస్యలపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. వారికి ఆదాయం కల్పించేలా నిర్ణయం తీసుకుంది. 

ఒక్కో వాహనదారుడికి ప్రస్తుతం అద్దె కింద రూ.10 వేలు, పెట్రోల్ నిమిత్తం రూ.3 వేలు, హెల్పర్ చార్జీల కోసం రూ.3 వేలు కలిపి నెలకు మొత్తం రూ.16 వేలు చెల్లిస్తున్నారు. తాజాగా అద్దెను రూ.10 వేల నుంచి రూ.13 వేలకు, హెల్పర్ చార్జీలను రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంచాలని నిర్ణయించింది.  

ఇక పెట్రోల్ కోసం గతంలో మాదిరిగానే రూ.3 వేలు చెల్లిస్తారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఒక్కో వాహనదారుడికి నెలకు రూ.5 వేల చొప్పున అదనంగా వస్తుంది. దీంతో మొత్తంగా వాహనదారుడికి నెలకు మొత్తంగా రూ.21 వేలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  

 

Leave a Comment