ఆమెకు 65.. అతనికి 23.. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు..!

పాకిస్తాన్ లో జరిగిన ఓ వివాహం సంచలనంగా మారింది. 23 ఏళ్ల యువకుడు 65 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకోవడం ప్రస్తుతం పాకిస్తాన్ లో చర్చకు దారితీసింది. వధువు ఆ యువకుడి కంటే 42 ఏళ్లు పెద్ద వయస్సురాలు కావడమే అందుకు కారణం.. ఏం జరిగిందంటే.. పాకిస్తాన్ దేశం పంజాబ్ లోని గుంజరవాలాకు చెందిన 23 ఏళ్ల అబ్దుల్లాకు ఫేస్ బుక్ లో అరియానా పరిచయమైంది. 

అరియానాది చెక్ రిపబ్లిక్.. అతనికంటే 42 సంవత్సరాలు పెద్ద మహిళ.. అబ్దుల్లా వృత్తి పరంగా చిత్రకారుడు. అరియానా ఉపాధ్యాయురాలు.. వీరు అనుకోకుండా ఫేస్ బుక్ లో పరిచయమయ్యారు. ఆ తర్వాత ఇద్దరు ఒకరినొకరు తమ ఫొటోలను చూసుకొని ఇష్టపడ్డారు. అలా రెండేళ్లు ఆన్ లైన్ లోనే ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.

అయితే ఇద్దరు కలుసుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఏడాది నుంచి ప్రయత్నాలు చేస్తున్నా అరియానాకు వీసా దొరకలేదు. అబ్దుల్లాకు కూడా వీసా ప్రయత్నాలతు విఫలమయ్యాయి. చివరికి పాకిస్తాన్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించడంతో చివరికి ఇద్దరు కలవగలిగారు. అలా వీరిద్దరు కలిసేందుకు మూడు సంవత్సరాలు పట్టింది.

పెళ్లి తర్వాత ఇద్దరు చెక్ రిపబ్లిక్ లో స్థిరపడేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇద్దరు కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. పిల్లలను కనేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే అందుకు వైద్యులు నిరాకరిస్తున్నారు. అరియానా వయస్సు రిత్యా పిల్లల్ని కనేందుక ప్లాన్ చేయవద్దని వైద్యులు సలహా ఇస్తున్నారు.   

Leave a Comment