క్రిష్ తో పవన్ సినిమా..!

పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి వరుసగా సినిమాలు చేసేందుకు ఒప్పుకుంటున్నారు. ఇప్పిటికే వేణుశ్రీరాం దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల వకీల్ సాబ్ సినిమా ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ లుక్ కు అభిమానుల్లో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆత్రుతతో ఎదురు చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత పవన్- క్రిష్ తో సినిమా చేస్తున్నాడు. క్రిష్ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది. పీరియాడిక్ స్టోరీతో సినిమా రానుందని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ తో, త్రివిక్రమ్ తో, సుందర్ రెడ్డి పర్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా పవన్ లిస్ట్ లో మరో డైరెక్టర్ పేరు కూడా వినిపిస్తుంది. పవన్ తో ‘గోెపాల గోపాల’ వంటి హిట్ ఇచ్చిన డాలీ పవన్ తె సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నడు. పవన్ కోసం ఒక స్టోరీని కూడా సిద్ధం చేస్తున్నాడట డాలీ. అన్ని కుదిరితే 2021 మధ్యలో షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ కాంబోకి సంబంధించి పూర్త వివరాలు తెలియాల్సి ఉంది.  

Leave a Comment