టీడీపీ వల్లే బీసీ సాధికారత..! : చంద్రబాబు

అమరావతి : తెలుగుదేశం పార్టీ బీసీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ వల్లే బీసీ రాజకీయ సాధికారత సాధ్యమైందన్నారు. వైసీపీ ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు తగ్గించి బీసీల గొంతు కోసిందన్నారు. 10శాతం కోత వల్ల బీసీలు 16 వేల పదవులు కోల్పోతారని చంద్రబాబు అన్నారు. బీసీల పట్ల వైసీపీ ప్రభుత్వం ఉన్మాదంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు దుయ్యబట్టారు. బీసీ రిజర్వేషన్లు తగ్గింపుపై నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ధర్నాలు చేపడతామన్నారు. బీసీ రిజర్వేషన్లు 33ఏళ్లుగా టీడీపీ కల్పించిన హక్కుని అన్నారు. బీసీల భూములు లాక్కున్నారని, బీసీ సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లించారని ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ ఉన్మాదం పేట్రేగిపోతోందని, ఉద్యమించే సమయం ఆసన్నమైందని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.

 

Leave a Comment