చిన్నారి కుటుంబానికి పవన్ కళ్యాణ్ పరామర్శ.. ఫ్యాన్స్ పై పవన్ అసహనం..!

126
Pawan Kalyan

సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి హత్యాచారినికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పటికే రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు బాధిత కుటుంమాన్ని పరామర్శించారు. నిందుతుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

బుధవారం సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాన్ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించారు. చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చారు. చిన్నారిపై అఘాయిత్యం జరగడం తనను కలిచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి తాను ఎల్లప్పుడు అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. నిందితుడికి శిక్ష పడే వరకు పోరాడతామని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు.  

ఇక పవన్ కళ్యాణ్ రావడంతో ఆ ప్రాంతమంతా అభిమానులతో నిండిపోయింది. సింగరేణి కాలనీకి పవన్ చేరుకోగానే ఆయన్ను చూసేందుకు అభిమానులు ఎగబడగంతో తోపులాట చోటుచేసుకుంది. అభిమానుల రద్దీ వల్ల కారు దిగలేక పవన్ ఇబ్బంది పడ్డారు. అభిమానుల తీరుతో పవన్ ఒకింత అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. 

Previous articleసాయి తేజ్ ను కాపాడిన వ్యక్తికి రామ్ చరణ్ అద్దిరిపోయే గిఫ్ట్..నిజమేనా..?
Next articleబాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు దీక్ష చేస్తా : వైఎస్ షర్మిల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here