సాయి తేజ్ ను కాపాడిన వ్యక్తికి రామ్ చరణ్ అద్దిరిపోయే గిఫ్ట్..నిజమేనా..?

140
Sai Tej

మెగా హీరో సాయిధరమ్ తేజ్ గత శుక్రవారం స్పోర్ట్స్ బైక్ స్కిడ్ కావడంతో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.. దుర్గం చెరువు కెబుల్ బ్రిడ్జీ మీదుగా ఐకియా వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే నగరంలో ఉన్న హాస్పిటల్ కు తీసుకెళ్లగా ఆయనకు చికిత్స అందించారు. ఇక ప్రస్తుతం సాయి తేజ్ హాస్పిటల్ లో ఉంటూ చికిత్స పొందుతున్నాడు. 

సరైన సమయంలో చికిత్స అందడం వల్లే సాయి ధరమ్ తేజ్ కు ప్రాణాపాయం తప్పిందని తేజ్ కు మొదట ట్రీట్మెంట్ చేసిన మెడికవర్ వైద్యులు తెలిపారు. 108 సిబ్బంది సమయానికి అతన్ని ఆస్పత్రికి తీసుకొచ్చారని చెప్పారు. అయితే సాయి ధరమ్ తేజ్ కు ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వెంటనే స్పందించి 108 కు కాల్ చేసి తేజ్ ప్రానాపాయ స్థితి నుంచి బయటపడటంలో కీలక పాత్ర పోషించారు. నిజాంపేట క్రాస్ రోడ్డులో కొత్తగా ప్రారంభమైన సీఎంఆర్ షాపింగ్ మాల్ లో వ్యాలెట్ పార్కింగ్ వద్ద ఉండే అబ్దుల్.. 

ఇటీవల అబ్దుల్ ఓ మీడియాకు ప్రమాదం జరిగిన రోజు ఏం జరిగిందో వివరించాడు. ఆ సమయంలో సాయి ధరత్ తేజ్ ఫోన్ తీసి చూశానని, కానీ లాక్ ఉండటంతో ఎవరికీ ఫోన్ చేయలేకపోయా అని చెప్పాడు. వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేశానని తెలిపాడు. అయితే ప్రమాదానికి గురైన వ్యక్తి హీరో అని తనకు తెలియదన్నాడు. దీంతో అబ్దుల్ చేసిన సహాయానికి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 

కాగా అబ్దుల్ గురించి మరోవార్త వైరల్ గా మారింది. అబ్దుల్ ను మెగా ఫ్యామిలీ అభినందించిందని, అంతేకాకుండా అతడికి మెగా హీరో రామ్ చరణ్ ఖరీదైన కారును స్వయంగా తన చేతుల మీదుగా బహుమతిగా ఇచ్చాడని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను అబ్దుల్ ఖండించాడు. ఇవన్నీ పుకార్లే నని ఇందులో ఎటువంటి నిజం లేదని అన్నాడు. ఎవరూ తనకు గిఫ్ట్ ఇవ్వలేదని తెలిపాడు. అంతేకాకుండా మెగా ఫ్యామిలీ నుంచి తనకు ఎవరు ఫోన్ చేయలేదని, కేవలం సాటి వ్యక్తిగా ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడానని తెలిపాడు. వారి నుంచి ఏదీ ఆశించడం లేదని, ఇలాంటి తప్పుడు వార్తలతో తమ కుటుంబం ఇబ్బందులు పడుతుందని, దయచేసి ఇటువంటి పుకార్లను సృష్టించవద్దని కోరాడు. 

 

Previous article24 ఏళ్ల యువకుడితో 61 ఏళ్ల బామ్మ పెళ్లి..!
Next articleచిన్నారి కుటుంబానికి పవన్ కళ్యాణ్ పరామర్శ.. ఫ్యాన్స్ పై పవన్ అసహనం..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here