అలా లీక్ చేశారేంటీ? పవన్ 27వ సినిమా టైటిల్ లీక్..

ఈ డిజిటల్ యుగంలో ఏదీ దాగడం లేదు. ప్రతి ఒక్కటీ బయటకు వచ్చేస్తుంది. పొరపాటుగా నొరు జారినా అది కాస్తా..సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది. ఇక సినిమా లీకులైతే చెప్పనవరసం లేదు. దానికి మరికొంత జోడించి చూపిస్తున్నారు. అలాంటి పొరపాటే చేశారు మెగా బ్రదర్. 

ఇటీవల అభిమానులతో చిట్ చాట్ లో నాగబాబు నోరు జారారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా సినిమా టైటిల్ ని లీక్ చేశారు. పవన్ కోసం ‘విరూపాక్ష’ అనే టైటిల్ ని అనుకుంటున్నారని చెప్పారు. క్రిష్ కాని నిర్మాత ఏ.ఎం.రత్నం కానీ టైటిల్ గురించి ఏమీ చెప్పకముందే పవన్ నటిస్తున్న 27వ సినిమా టైటిల్ ని నాగబాబు చెప్పేశారు. మరీ దీనిపై దర్శకనిర్మాతలు ఏం చేస్తారో చూడాలి. 

ఇంకా ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఒక గజదొంగగా కనిపిస్తారని, ఔరంగజేట్ కాలం నాటి స్టోరీ ఇదని నాగబాబు లీక్ చేశారు. దీంతో పవన్ 27 సినిమా విషయంలో సస్పెన్స్ లేకుండా పోయింది. 

ఇక ఒక పబ్లిక్ వేదికపై మెగాస్టార్ చిరంజీవి తాను నటిస్తున్న ప్రతిష్టాత్మక 152వ సినిమా టైటిల్ ‘ఆచార్య’ అంటూ నోరు జారారు. దర్శకుడు కొరటాల సహా రామ్ చరణ్ ఈ లీక్ పై షాక్ అయ్యారు. మెగాస్టార్ నోటి నుంచి లీక్ అయిన ఈ సినిమా గురించి అభిమానుల్లో చర్చగా మారింది. ఈ సినిమాలో పర్యావరణం అటవీ సంపదను కాపాడే వాడిగా చిరు కనిపిస్తారని, నక్సలైట్ షేడ్ ఉంటుందని కూడా మెగాస్టార్ లీకులిచ్చేయడం షాక్ కు గురిచేసింది.  

Leave a Comment