‘Zoom’ సురక్షితం కాదు..

మీరు Zoom యాప్ ఉపయోగిస్తున్నారా? అయితే మీ డేటా భద్రమేనా? కాదంటుందో కేంద్ర ప్రభుత్వం. లాక్ డౌన్ సమయంలో వీడియో కాన్ఫరెన్స్ కోసం ఉపయోగిస్తున్న Zoom ప్లాట్ ఫామ్ సురక్షితం కాదని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.  ప్రభుత్వ సంస్థలు అధికారిక సమావేశాల కోసం దీన్ని వినియోగించవద్దని కేంద్ర హోం శాఖ ప్రకటించింది. దీనికి సంబంధించిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట-ఇన్) హెచ్చరికను సైబర్ కోఆర్డినేషన్ కేంద్రం నిర్ధారించింది. అధికారిక సమావేశాల కోసం అధికారులు Zoom ప్లాట్ ఫామ్ ను వినియోగించవద్దని స్పష్టం చేసింది. 

సైబర్ నేరగాళ్లు సమావేశ వివరాలు మరియు సంభాషణలు వంటి సున్నితమైన సమాచారాన్ని హ్యాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ Zoom యాప్ కోసం ప్రైవసీ ఆందోళనలు పెరగడానికి ఒక కారణం లాక్ డౌన్ సమయంలో దీని వినియోగం విరివిగా పెరిగింది. అందరూ వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. భద్రతా సమస్యల కారణంగా Zoom యాప్ ను వినియోగించవద్దని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. అలాగే, Zoom వినియోగించే ప్రయివేటు సంస్థలు, వ్యక్తుల కోసం కొన్ని సూచనలు చేసింది. 

  • వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభం కాగానే, అడ్మినిస్ట్రేటర్ ‘లాక్ మీటింగ్’ ఆప్షన్ ను ఆన్ చేయాలి.
  • ప్రతి మీటింగ్ కు కొత్తగా యూజర్ ఐడీని, పాస్ వర్డ్ ను క్రియేట్ చేసుకోవాలి.
  • అడ్మినిస్ట్రేటర్ అనుమతితో కొత్త సభ్యులు మీటింగ్ లో పాల్గొనేలా ‘వెయింటింగ్ రూమ్’ ఆప్షన్ ను ఎనేబుల్ చేయాలి. 

Leave a Comment