కరోనా నివారణకు పతంజలి చికిత్స : బాబా రాందేవ్ వెల్లడి..

కరోనా వైరస్ కు వ్యతిరేకంగా 100 శాతం రికవరీ రేటును సాధించాలనే లక్ష్యంతో పతంజలి ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసిందని యోగా గురువు బాబా రామ్ దేవ్ చెప్పారు. కరోనా వైరస్ తో తాము ఎవరినీ చనిపోనివ్వమని, సున్నా శాతం మరణాల రేటు సాధిస్తామని దీమా వ్యక్తం చేశారు. అశ్వగంధ, గిలోయ్ మరియు తులసి మిశ్రమం నుంచి ఔషధాన్ని తయారు చేశామన్నారు. దీనిని కరోనిల్ అని పిలుస్తారని చెప్పారు. 

కరోనా వైరస్ బారినపడిన వ్యక్తి ఆయుర్వేద చికిత్స ద్వారా తనను తాను ఎలా చికిత్స చేసుకోవాలో బాబా రామ్ దేవ్ వెల్లడించారు. ఈ ఔషధాన్ని ఇచ్చిన రోగులు ఇప్పుడు పూర్తి కోలుకున్నారన్నారు. రోజు వారీ ఆసనాలు మరియు ప్రాణాయామం లేదా అనులోమ్ విలోమ్ ఆసనాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయని వెల్లడించారు. 

అశ్వగంధ, గిలోయ్ మరియు తులసి ద్వారా తయారు చేసిన ఔషధం పతంజలి కరోనిల్ కరోనా రోగులకు చికిత్స చేయడంలో విజయవంతమైందని రామ్ దేవ్ స్పష్టం చేశారు. పతంజలి ఆయుర్వేద చికిత్స పొందిన కరోనా రోగులు వంద శాతం రికవరీ అయ్యారని వివరించారు. 

కరోనా వైరస్ ప్రమాదం ఉన్న వారికి యోగా తక్షణ ప్రయోజనం చేకూరుస్తుందని స్వామి రాందేవ్ అన్నారు. కరోనా వైరస్ మన ఊపిరితిత్తులపై దాడి చేస్తుందని, యోగా చేయడం ద్వారా మన ఊపిరితిత్తులు బలోపేతం అవుతాయని సూచించారు. 

Leave a Comment