ఇండియాలో మహిళల వివాహ వయస్సు 18 నుంచి 21 పెంచే అవకాశం..

భారతదేశంలో మహిళల వివాహ వయస్సును పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రాథమిక విద్య మరియు సౌకర్యాల పెరుగుదల కారణంగా ఇప్పుడు మహిళల వివాహ చట్టబద్ధమైన వయస్సును 18 నుంచి 21 సంవత్సరాల వరకు పెంచాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయంపై జులై 31 లోగా సిఫార్సులను సమర్పించడానికి ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. 

అంతకుముందు, దీనిని 1929లో శారదా చట్టానికి సవరణగా 1978లో మహిళల వివాహ వయస్సును 15 నుంచి 18 ఏళ్లకు పెంచారు. 1978 నుంచి వివాహానికి కనీస చట్టబద్ధమైన వయస్సు మహిళలకు 18 ఏళ్లు మరియు పురుషులకు 21 ఏళ్లుగా నిర్ణయించారు. భారతదేశంలో తల్లుల మరణాల రేటు మరియు ఆరోగ్యం దృష్ట్యా దీనిని పునఃపరిశీలించడానికి ప్రధాన కారణంగా చెప్పింది. 

అయితే ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ నిర్ణయం సందర్భంగా ఈ విషయంపై వచ్చే ఆరునెలల వ్యవధిలో మరోసారి పరిశీలిస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా జూన్ 4, 2020న గెజిట్ నోటిఫికేషన్ లో మాతృత్వ వయస్సును పరిశీలించడానికి ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రసూతి మరణాల రేటును తగ్గించడం, పోషక స్థాయిల మెరుగుదల మరియు సంబంధిత సమస్యలను పరిశీలిస్తుంది. దీని తర్వాత మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మహిళల చట్టబద్ధమైన వయస్సును 18 నుంచి 21కి పెంచే అవకాశాన్ని సూచిస్తుంది. 

Leave a Comment