విమానం నుంచి దూకేశాడు..!

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో యూనైటెడ్ ఎక్స్ ప్రెస్ విమానం టేకాఫ్ అయ్యేందుకు రన్ వేపై వేగంగా కదులుతుండగా, ఓ ప్రయాణికుడు హఠాత్తుగా విమానం తలుపు తెరచుకొని బయటకు దూకేశాడు. దీంతో విమానాశ్రయ అధికారులు అవాక్కయ్యారు. శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

సాయంత్రం 7 గంటల సమయంలో విమానం సాల్ట్ లేక్ నగరానికి బయల్దేరింది. ఇంతలో ఓ ప్రయాణికుడు కాక్ పిట్ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించాడు. అది సాధ్యం కాకపోవడంతో వెంటనే లోపలికి వచ్చి.. అత్యవసర ద్వారం తెరచి బయటకు దూకేశాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు రన్ వే పైనే అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. 

చిన్నాపాటి గాయాలవ్వడంతో విమానాశ్రయ ఆస్పత్రిలోనే చికిత్స అందించారు. అయితే, ఎందుకలా దూకాడన్న దానిపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్బీఐ) అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో విమానం రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. 

Leave a Comment