61 ఏళ్ల వయసులో ‘NEET’ అర్హత.. చివరి నిమిషంలో ఎంబీబీఎస్ సీటు త్యాగం..!

చాలా మందికి డాక్టర్ కావాలని కల ఉంటుంది. అయితే డాక్టర్ కావడం అనేది అంత సులభం కాదు. దీంతో చాలా మంది వేరే ప్రొఫెషన్ ను ఎంచుకుంటారు. కానీ ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు చదువుకు వయసు అడ్డు కాదని నిరూపించాడు. 61 ఏళ్ల వయసులో ‘నీట్’ పరీక్షలో ఉత్తీర్ణత పొంది ఎంబీబీఎస్ సీటు సాధించాడు. అయితే చివరి నిమిషంలో తన ఎంబీబీఎస్ సీటును వదులుకుని ఓ విద్యార్థికి లైఫ్ ఇచ్చారు.

తమిళనాడులోని ధర్మపురికి చెందిన 61 ఏళ్ల రిటైర్డ్ ఉపాధ్యాయుడు కె.శివ ప్రకాశత్ గతేడాది నీట్ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించారు. తమిళనాడు రాష్ట్రంలో జనవరి 27 నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్, వైద్య విద్య కోర్సులకు కౌన్సెలింగ్ ప్రారంభమైంది. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 7.5 శాతం కోట కింద శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. 

ఈ కౌన్సెలింగ్ లో ధర్మపురికి చెందిన కె.శివప్రకాశత్ విద్యార్థులతో కలిసి హాజరయ్యారు. ఇదే కౌన్సెలింగ్ లో ఆయన వద్ద చదువుకున్న విద్యార్థులు కూడా ఉన్నారు. అయితే చివరి నిమిషంలో ఆయన ఎంబీబీఎస్ సీటును వదులుకున్నారు. యువతకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో సీటు వదులుకున్నట్లు ప్రకటించారు. 

Leave a Comment