ఇటీవల వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు వార్తలు, అసభ్యకరమైన కంటెంట్, రెచ్చగొట్టే వ్యాఖ్యలు కోకొల్లలుగా వస్తున్నాయి. ఇలాంటి వార్తల వల్ల ప్రజలుపై దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు వాట్సాప్ గ్రూపుల్లో ఇలాంటి ఫేక్ న్యూస్ వల్ల వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. తప్పుడు వార్తల ప్రచారం వంటి వాటిలో గ్రూప్ అడ్మిన్లు నేరస్తులుగా చూపిస్తున్నారు. అయితే ఇలాంటి వార్తలకు గ్రూప్ అడ్మిన్లను బాధ్యులుగా చేయలేమని ఇటీవల బాంబే హైకోర్టు, మద్రాస్ హైకోర్టులు ఇచ్చిన తీర్పుల్లో పేర్కొన్నాయి. కొత్త సభ్యులను చేర్చుకోవడం, లేదా సభ్యులను డిలీట్ చేయడం వంటివి తప్పితే.. గ్రూపుల్లో వచ్చే సందేశాలను డిలీట్ చేసే పవర్స్ అడ్మిన్లకు లేవని పేర్కొన్నారు.
ఈక్రమంలో తప్పుడు వార్తలకు చెక్ పెట్టేందుకు వాట్సాప్ ఓ కొత్త ఫీచర్ ని తీసుకొస్తుంది. వేస్ట్ మెసేజ్ లను గ్రూపులో ఉన్న వారికి ఎవరికీ కనిపించకుండా డిలీట్ చేసేలా వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు మరో కొత్త పవర్ ఇవ్వనుంది. ‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్/ఆల్’ ఫీచర్ ని ఇప్పటికే విజయవంతంగా టెస్ట్ చేసింది. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ తో వాట్సాప్ అప్ డేట్లు ఇచ్చే వాట్సాప్ బీటా ఇన్ఫో ట్విట్టర్ లో ఈ విషయాన్ని వెల్లడించింది. ‘మీరు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ అయితే భవిష్యత్ లో మెసేజ్ లన ఎవరికీ కనిపించకుండా డిలీట్ చేయవచ్చు.. ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటాలో ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది.’ అంటూ ట్వీట్ చేసింది..దీనిపై వాట్సాప్ నుంచి అధికారిక ప్రకటర రావాల్సి ఉంది.