వూహాన్ లో మాస్కులు లేకుండా వేలమందితో పార్టీ..!

ప్రపంచానికి కరోనా మహమ్మారిని పరిచయం చేసిన చైనాలోని వూహాన్ ఇప్పుడిప్పుడి కోలుకుంటుంది. అక్కడ పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి. చైనాలో కరోనా కేసులు తగ్గడంతో అక్కడ లాక్ డౌన్ ఎత్తివేశారు. అయినా ప్రజలు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. 

కాని వూహాన్ లోని మాయా బీచ్ పార్క్ లో ఆదివారం విద్యుత్ వెలుగుల మ్యూజిక్ పార్టీ జరిగింది. ఆ పార్టీలో ప్రజలు కరోనా నిబంధనలను గాలికొదిలేశారు. ఒక్కరు కూడా మాస్క్ ధరించకుండా, భౌతికదూరం పాటించకుండా నీళ్లలో ఆటలాడారు. ఒకరికొకరు ఆనుకుంటూ గుంపులు గుంపులుగా ఎంజాయ్ చేశారు. వేలాది మంది పాల్గొన్న ఈ పార్టీలో ఒక్కరు కూడా మాస్క్ ధరించకపోవడం అందిరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 

 ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచాన్ని నాశనం చేసి ఎంజాయ్ చేస్తున్నారంటూ విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. చైనా వద్ద ముందుగానే కరోనా వ్యాక్సిన్  ఉంది. కానీ ప్రపంచానికి ఇవ్వడం లేదంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి కొందరైతే కొత్త వైరస్ కోసం ప్లాన్ చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. 

 

Leave a Comment