ప్రత్యేక హెయిర్ స్టయిల్ తో ఆకట్టుకుంటున్న ‘బాబ్ కట్ సెంగమలం’

మనుషులేనా తాము కూడా అందంగా తయారవుతాం అంటూ తన హెయిర్ స్టైల్ తో అందరినీ ఆకట్టుకుంటోంది ఓ ఏనుగు. అయితే ఈ ఏనుగు హెయిర్ స్టైల్ కు భారీగానే ఫ్యాన్స్ సంపాదించుకుంది. తమిళనాడుకు చెందిన ఈ ఏనుగు బాబ్ కట్ సెంగమలంగా పిలవబడుతోంది. సెంగమలం ఏనుగును 2003 లో కేరళ నుంచి తమళనాడు మన్నార్గుడి పట్టణంలోని రాజగోపాలస్వామి ఆలయానికి తీసుకొచ్చారు.

 ఈ ఏనుగు తన బాబ్ కట్ హెయిర్ స్టయిల్ ద్వారా దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ ఏనుగు యొక్క ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఏనుగు సంరక్షణను  ఎస.రాజగోపాల్ చూసుకుంటారు. సెంగమలం ప్రత్యేకంగా కనబడేందుకు రాజగోపాల్ ఈ విధంగా హెయిర్ స్టైల్ పెట్టాడు.  దీంతో ఈ ఏనుగు ఆలయానికి వచ్చే సందర్శకులను కూడా ఆకట్టుకుంటుంది. 

 

Leave a Comment