మీ పాన్ కార్డు..ఆధార్ తో లింక్ అయిందా? లేదా? చెక్ చేసుకోండి..!

మీ దగ్గర పాన్ కార్డు ఉందా? మీ PAN cardను Aadhar నెంబర్ తో లింక్ చేశారా? చేయకపోతే త్వరలో మీ పాన్ కార్డు చెల్లకపోవచ్చు. PAN cardను ఆధార్ తో లింక్ చేసుకోవాలంటూ ఆదాయపు పన్ను శాఖ కోరుతున్నప్పటికీ భాతర దేశంలో ఇంకా 17 కోట్లకు పైగా PAN cardలు ఆధార్ నెంబర్ కు లింక్ చేయలేదు. దీనిపై ఆదాయపు పన్ను శాఖ ఇప్పటి వరకు 8 సార్లు గడువు పెంచింది. 2020 మార్చి 31 వరకు PAN cardను ఆధార్ తో లింక్ చేసుకోవాలంటూ గడువు పొడగిస్తూ చివరి సారి ఆదేశాలు జారీ చేసింది. భారతదేశంలో 48 కోట్ల పాన్ కార్డులు జారీ అయ్యాయి. అయితే ఆదాయపు పన్నుల శాఖ ఇన్ని సార్లు గడువు పొడిగించినా ఇంకా ఆధార్ లింక్ చేయని పాన్ కార్డులు 17 కోట్ల పేనే ఉండటం విశేషం..

ఫైనాన్స్ బిల్-2019 సవరణ ప్రకారం ఆధార్ లింక్ చేయని పాన్ కార్డులు చెల్లవని ఆదాయపు పన్ను శాఖ నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఒక వేళ ఈ పాన్ కార్డులు చెల్లవని ఆదాయపు పన్ను శాఖ ప్రకటించిందంటే ఆ కార్డులను ఎక్కడ వాడాలన్నా సాధ్యం కాదు. 2020 జనవరి వరకు 30.75 పాన్ కార్డులను ఆధార్ నెంబర్ తో లింక్ చేశారని, ఇంకా ఆధార్ లింక్ చేయని పాన్ కార్డులు 17.58 కోట్లు ఉన్నాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఇటీవల లోక్ సభలో వెల్లడించారు. పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ పరస్పరం మార్చుకోగలిగే అవకాశాన్ని కేంద్రం కల్పించినా, ఈ రెండు కార్డులు లింక్ చేయడం తప్పనిసరి. ఒక వేళ మీరు ఈ రెండు లింక్ చేయకపోతే ఎక్కడైనా ఆర్థిక లావాదేవీల కోసం పాన్ కార్డుల బదులు ఆధార్ నెంబర్ వెల్లడిస్తే మీకు ఆదాయపు పన్ను శాఖ కొత్త పాన్ కార్డు జారీ చేస్తుంది. ఆదాయపు పన్ను మోసాలు, మనీ లాండరింగ్, కార్డుల డూప్లికేషన్ లాంటివి అరికట్టేందుకు పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేయడం తప్పనిసరి చేసింది ఆదాయపు పన్ను శాఖ. 

స్టేటస్ తెలుసుకోవడం ఎలా?

మీరు గతంలో PAN card-Aadhar  లింక్ చేసినట్లయితే దాని స్టేటస్ తెలుసుకోవడం లాచా సులువు. అందుకోసం ముందుగా మీరు 

  • www.incometaxindiaefiling.gov.in   లింక్ ను ఓపెన్ చేయాలి. 
  • అప్పుడు లింక్ ఆధార్ స్టేటస్ అనే పేజీ ఓపెన్ అవుతుంది. 
  • అక్కడ PAN అని ఉన్న చోట బాక్సులో మీ PAN card నెంబర్ ఎంటర్ చేయాలి.
  • తరువాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.
  • ఆ తరువాత View Link Aadhar Status పైన క్లిక్ చేస్తే మీరు మీ పాన్ కార్డుకు ఆధార్ లింక్ చేశారో లేదో తెలుస్తుంది. 

SMS ద్వారా …

ఎస్ఎంఎస్ ద్వారా కూడా స్టేటస్ తెలుసుకోవచ్చు. ఇందు కోసం మీరు UIDPAN<12 Digit Aadhar Number><10 digit Permanemt Account Number> అని టైప్ చేసి 567678 లేదా 56161 నెంబర్ కు ఎస్ఎంఎస్ చేయాలి. 

Leave a Comment