గాడిదను అరెస్టు చేసిన పాక్ పోలీసులు..!

పోలీసులు తమ పనిలో ప్రశంసలు పొందాలి. కానీ పాకిస్థాన్ పోలీసులు నవ్వులపాలయ్యారు. ఎందుకనుకుంటున్నారా? ఎవరైనా తప్పు చేస్తే పోలీసులు మనషులను అరెస్టు చేస్తారు. కానీ పాకిస్థాన్ పోలీసు ఓ గాడిదను అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు అక్కడి పోలీసుల తీరును చూసి నవ్వుకుంటున్నారు. 

పాకిస్థాన్ లోని ఓ ప్రాంతంలో ఎనిమిది మంది వ్యక్తులు గాడిదతో రేసింగ్ గేమ్ ఆడారు. అది కూడా బెట్టింగ్ పెట్టి..దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1,20,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. అంతే కాదు..రేసింగ్ ఆడిన గాడిదను కూడా పోలీసులు అరెస్టు చేశారు. 

అయితే గాడిదను పోలీసులు అరెస్టు చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఎఫ్ఐఆర్ లో గాడిద పేరు కూడా ఉందని, అందుకోసం దానిని విడుదల చేయడం లేదాని పోలీసులు చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ జర్నలిస్టు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 

Leave a Comment