ఆపిల్ పండ్లు ఆర్డర్ చేస్తే.. ఐఫోన్ వచ్చింది..!

సాధారణంగా ఆన్ లైన్ లో ఆపిల్ ఫోన్ ఆర్డర్ చేస్తే ఆపిల్ పండ్లు రావడం, ఖరీదైన వస్తువులు ఆర్డర్ చేస్తే నాణ్యత లేనివి రావడం చూశాం.. తాజగా ఓ వ్యక్తి ఆపిల్ పండ్లు ఆర్డర్ చేస్తే.. ఆపిల్ ఐఫోన్ వచ్చింది. దీంతో ఆ వ్యక్తి జాక్ పాట్ కొట్టేశాడు.. ట్వికెన్ హామ్ కు చెందిన 50 ఏళ్ల నిక్ జేమ్స్ అనే వ్యక్తి ఆన్ లైన్ లో కొన్ని ఆపిల్ పండ్ల కోసం సూపర్ మార్కెట్ కు ఆర్డర్ ఇచ్చాడు.

దీంతో అతనికి ఒక పార్సిల్ వచ్చింది. ఆ పార్సిల్ లో ఆపిల్ పండ్లతో పాటు ఆపిల్ ఐఫోన్ ఎస్ఈ కూడా వచ్చింది. దీంతో ఆ వ్యక్తి సంతోషంతో ఉబ్బితబ్బియ్యాడు. కానీ ఈస్టర్ సందర్భంగా ఏదైనా ప్రాంక్ చేశారా అనుకున్నాడు. అయితే టెస్కో మార్కెట్ కంపెనీ ఇచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్ అని తెలుసుకున్న జేమ్స్ థ్రిల్ అయ్యాడు. 

టెస్కో గ్రోసరీ సంస్థ ప్రమోషన్ క్యాంపేన్ లో భాగంగా ఆపిల్ పండ్లతో పాటు ఐఫోన్ స్పెషల్ ఎడిషన్ ఫోన్ ను గిఫ్ట్ గా అతనికి అందించింది. ‘సూపర్ సబ్ స్టిట్యూట్’లో రెగ్యులర్ అవసరమైన వస్తువులను కొనుగోలు చేసిన వినియోగదారులకు ఆపిల్ ఐఫోన్లు, ఎయిర్ ప్యాడ్స్ తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ఊహించని బహుమతులుగా అందిస్తోంది… 

Leave a Comment