‘ఆస్పత్రిలో బెడ్ ఇవ్వండి.. లేదా మా నాన్నను చంపేయండి’.. ఓ కుమారుడి ఆవేదన..!

దేశంలో కరోనా సెకెండ్ వేవ్ కేసుల ఉధృతి కొనసాగుతోంది.. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇక మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ కేసులు భారీగా పెరిగిపోయాయి. ఆస్పత్రుల్లో చేరి వారి సంఖ్య కూడా భారీగా పెరిగింది. దీంతో ఆస్పత్రుల్లో బెడ్లన్ని కరోనా రోగులతో నిండిపోయాయి. పేషంట్లకు బెడ్లు దొరకడం లేదు.. 

ఓ వ్యక్తి కరోనా బారిన పడ్డాడు. అతడ్ని ఆస్పత్రిలో చేర్పిచడానికి అంబులెన్స్ లో అతడి కుమారుడు 24 గంటల పాటు రెండు రాష్ట్రాల్లో తిరిగాడు. అయినప్పటికీ బెడ్లు దొరకలేదు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన అతడు తన తండ్రికి ఆస్పత్రిలో బెడ్ అయినా ఇవ్వండి లేదా ఓ ఇంజెక్షన్ ఇచ్చి చంపేయండి అని ప్రాదేయపడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

వివరాల మేరకు మహారాష్ట్రలోని చంద్రపూర్ కు చెందిన సాగర్ కిషోర్ తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కరోనా లక్షణాలు తీవ్రంగా ఉండటంతో అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించాడు. చంద్రపూర్ శివారులోని ఆస్పత్రులన్నీ తిరిగాడు. అయితే ఆస్పత్రులన్నీ రోగులతో నిండి ఉన్నాయి. 

ఇక ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లినా లాభం లేకపోయింది. చివరికి రాత్ర ఒకటిన్నర గంటల ప్రాంతంలో సరిహద్దు రాష్ట్రం తెలంగాణకు కూడా వెళ్లినప్పటికీ, అక్కడ సైతం చికిత్స అందించలేకపోయారు. ఇక చేసేదేమిలేక మళ్లీ ఉదయం తిరిగి మహారాష్ట్రకు తిరిగి వచ్చారు. 24 గంటల నుంచి తన తండ్రి అంబులెన్స్ లోనే ఉన్నాడని కిషోర్ ఆవేదన వ్యక్తం చేశాడు.

అంబులెన్స్ లో ఆక్సిజన్ లేని పరిస్థితి.. పేషంగ్ దగ్గుతో బాధపడుతున్నాడు.. దీంతో ‘ఆస్పత్రిలో బెడ్ అయినా ఇవ్వండి.. లేదా ఆయనను ఇంజెక్షన్ ఇచ్చి చంపేయండి’ అంటూ కంటతడి పెట్టాడు. ఈ పరిస్థితిలో ఆయనను ఇంటికి కూడా తీసుకెళ్లలేనని ఆవేదన వ్యక్తం చేశాడు. అనారోగ్యంతో ఉన్న తండ్రికి చికిత్స అందించడం కోసం చేయని ప్రయత్నం లేదని బాధపడుతున్నాడు. 

Leave a Comment