ఎక్కడి వారు అక్కడే ఉండాలి..వలస కూలీలకే అనుమతి..

ప్రయాణాల వల్ల వైరస్ వ్యాపించే అవకాశం ఎక్కువ

సీఎం జగన్ సమీక్ష

పొరుగు రాష్ట్రాల్లో ఉన్న వారు పెద్ద ఎత్తన రావాడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, కేంద్ర హోం శాఖ మార్గదర్శకాల ప్రకారం ఎక్కడి వారు అక్కడే ఉండాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కోవిడ్-19 నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలకు ఇది కష్టమే అనిపించినా..ప్రజారోగ్యం, వారి కుటుంబాల్లోని పెద్దల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని కోరింది.

పొరుగు రాష్ట్రాల్లో ఉన్న వారు సరిహద్దుల వద్దకు వచ్చి ఇబ్బందులు పడొద్దని సూచించింది. కేంద్ర హోం శాఖ మార్గదర్శకాల ప్రకారం వలస కూలీలకే అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుంది. ప్రస్తుతం వలస కూలీలు వేలల్లో ఉంటున్నారని, వారందర్నీ క్వారంటైన్ కేంద్రాల్లో పెట్టి పరీక్షలు చేస్తున్నామని పేర్కొంది.

 వీరికి సదుపాయాల కల్పన చాలా కష్టమవుతోందని, కోవిడ్‌–19 విపత్తు దృష్ట్యా ఎక్కడివారు అక్కడే ఉండడం క్షేమమని చెప్పింది. ప్రయాణాల వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని, అంతే కాక ఇంట్లో పెద్ద వారి ఆరోగ్యాలకు ముప్పు ఉంటుందని చెప్పింది. ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ప్రజల నుంచి సహకారం కొనసాగాలని కోరింది. కోవిడ్-19పై పోరాటంలో మీరు చూపుతున్న స్ఫూర్తి ప్రశంసనీయమని, ప్రభుత్వం ఇస్తున్న సూచనలు పాటించాలని సూచించింది.

Leave a Comment