సీఆర్పీఎఫ్ హెడ్ క్వార్టర్స్ మూసివేత

ఢిల్లీలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) యొక్క ప్రధాన కార్యాయాన్ని ఆదివారం మూసివేశారు. అక్కడ పని చేసే ఒక డ్రైవర్ కు కరోనా పాజిటివ్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు దేశ రాజధాని లోధి రోడ్ ఏరియా భవనంలోకి ఎవరినీ అనుమతించేది లేదని అధికారులు తెలిపారు. 

ఢిల్లీలోని మయూర్ విహార్ ఫేజ్-3లో ఉన్న పారామిలిటరీ ఫోర్స్ యొక్క 31వ బెటాలియన్ నుంచి 122 మంది జవాన్లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆ బెటాలియన్ కార్యాలయాన్ని మూసివేశారు. మరో 100 మంది పరీక్ష ఫలితాలు రావాల్సి ఉందని పారామిలిటరీ ఫోర్స్ తెలిపింది. పాజిటివ్ వచ్చిన జవాన్లు ఢిల్లీలోని మాండవాలిలోని ఒక కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. 

100 మందికి పైగా జవాన్లు ఉన్న ఒక బెటాలియన్ నుంచి పెద్ద సంఖ్యలో కేసులు రావడంపై హొం మంత్రిత్వ శాఖకు ఆందోళన కలిగించే అంశంగా ఉందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. 

Leave a Comment