ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

మద్యం ధరలు పెంపు

మద్యం దుకాణాలు మరింత తగ్గించాలని నిర్ణయం

మద్యం ధరలను 25 శాతం పెంచాలని, రానున్న రోజుల్లో దుకాణాల సంఖ్యను మరింత తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం దుకాణాల నిర్వహణపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మద్య దుకాణాలు తెరవ వచ్చంటూ కేంద్ర హోంశాఖ తన మార్గదర్శకాల్లో చెప్పిందని, ఈ మేరకు వివిధ రాష్ట్రాల్లో దుకాణాలు తెరుస్తున్నారని సమావేశంలో అధికారులు పేర్కొన్నారు. 

 మద్యం నియంత్రణ మన విధానమని ఆ దిశగా అనేక చర్యలు తీసుకున్నామని, మరిన్ని చర్యలు కూడా తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. దుకాణాల వద్ద రద్దీ లేకుండా, భౌతిక దూరం పాటించాల్సిన అవసరంపైనా సమావేశంలో చర్చ జరిగింది. దీనికోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

మద్యపానాన్ని నిరుత్సాహపరిచేలా, దుకాణాల వద్ద రద్దీని తగ్గించేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మద్యం ధరలను 25శాతం శాతం పెంచాలని,  అంతేకాక రానున్న రోజుల్లో దుకాణాల సంఖ్యను మరింతగా తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు.

సీఎం జగన్‌ అధికారంలోకి రాగానే 20 శాతం దుకాణాలను అంటే 4380 నుంచి 3500కు తగ్గించారు. బెల్టుషాపులను పూర్తిగా ఏరివేశారు. మద్యం అక్రమ రవాణాను, తయారీని నిరోధిస్తూ శిక్షలను గణనీయంగా పెంచుతూ చట్టాలు తీసుకు వచ్చారు. ప్రస్తుత నిర్ణయం కారణంగా మద్యందుకాణాల సంఖ్య మరింతగా తగ్గనుంది.

 మద్యం అమ్మకాల వద్ద భౌతిక దూరాన్ని కచ్చితంగా పాటించాలని, అలాగే మద్యం అమ్మకాల వేళలను కూడా నియంత్రించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి అధికారులు విధివిధానాలను ఖరారు చేయనున్నారు.

 

Leave a Comment