పెళ్లిళ్లు, ఫంక్షన్లలో 50 మందికే అనుమతి..!

కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ఏపీ ప్రభుత్వం కట్టదిట్టమైన చర్యలు చేపట్టింది. వివాహాలు, ఇంతర ఫంక్షన్లకు హాజరయ్యేవారిని 50 మందికి మాత్రమే పరిమితం చేసింది. అలాగే అంత్యక్రియలకు 20 మందికి మించి హాజరుకాకూడదని నిబంధనలు విధించింది. ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం, శానిటైజ్ చేసుకోవడంతో పాటు భౌతిక దూరం పాటించాలని సూచించింది. పెళ్లిళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలకు ముందస్తు అనుమతిని తప్పనిసరి చేస్తూ ఉత్తుర్వులు జారీ చేసింది. 

ఇక 50 శాతం పరిమితితోన ప్రజారవాణకు అనుమతిస్తామని, సినిమా థియేటర్లలో 50 శాతం సీట్లకు మాత్రమే అనుమతి అని తెలిపింది. స్విమ్మింగ్ పూల్స్, స్పోర్ట్స్ క్లబ్బులు, స్పాలను మూసివేస్తున్నట్లు పేర్కొంది. అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్స్ తో ప్రైవేట్ ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తామని వెల్లడించింది. రెమిడెసివిర్ పర్యవేక్షణ కోసం రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని పేర్కొంది. రెమిడెసివిర్ కొరత ఉంటే హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేయాలని సూచించింది 

Leave a Comment