సోనూసూద్ బాటలో మరో నటుడు.. కరోనా రోగుల కోసం ఆస్పత్రి నిర్మించనున్న గుర్మీత్..!

గతేడాది లాక్ డౌన్ సమయంలో నటుడు సోనూసూద్ ఎంతో మంది వలస కార్మికులను ఆదుకున్నాడు. వారిని సొంతూళ్లకు చేర్చాడు. అంతే కాకుండా జీవనానికి కావాల్సిన డబ్బులను సైతం అందజేశాడు. ఇప్పటికీ అడిగిన వారిక సాయం అందిస్తున్నాడు ఈ రియల్ హీరో సోనూసూద్.. తాజాగా మరో బాలీవుడ్ నటుడు గుర్మీత్ చౌదరి కూడా సోనూసూద్ బాట పట్టాడు..

కరోనా రోగుల కష్టాలు చూసి చలించిపోయిన గుర్మీత్ వారి కోసం హాస్పిటల్ నిర్మిస్తానని గుర్మీత్ చౌదరి ప్రకటించాడు. పాట్నా, లక్నోలో ఈ హాస్పిటళ్లు తర్వలోనే ప్రారంభిస్తానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. సామాన్య ప్రజలకు వైద్య సాయం అందించడం కోసం అన్ని సౌకర్యాలతో 1000 పడకల ఆస్పత్రిని నిర్మిస్తానని వెల్లడించాడు. తన ఆశయం నెరవేరేందుకు తనకు అండగా ఉంటారని ఆశిస్తున్నానంటూ పోస్ట్ చేశాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని తెలిపాడు. 

Leave a Comment