మాట్లాడుతుండగా పేలిన స్మార్ట్ ఫోన్.. యువకుడికి గాయాలు..!

స్మార్ట్ ఫోన్లు పేలుతున్న ఘటనలు ఇటీవల చోటుచేసుకున్నాయి. తాజాగా వన్ ప్లస్ నార్డ్ 2 5జీ స్మార్ట్ ఫోన్ మాట్లాడుతుండగా పేలిపేపోయింది. ఈ ఘటనలో ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన న్యూఢిల్లీలో జరిగింది. ఫోన్ పేలిన విషయాన్ని లక్ష్య వర్మ అనే వ్యక్తి ట్విట్టర్ లో షేర్ చేశాడు. 

తన తమ్ముడు వన్ ప్లస్ నార్డ్ 2 5జీ స్మార్ట్ ఫోన్ లో మాట్లాడుతుండగా ఆ ఫోన్ ఒక్కసారిగా పేలిందని తెలిపాడు. ఆ ఫోన్ మెటల్ తన తమ్ముడి మొహంపై, చేతిలో గుచ్చుకున్నాయని,  తీవ్ర గాయాలయ్యాయని పేర్కొన్నాడు. తమ్ముడిని వెంటనే ఆస్పత్రికి తరలించామని, అదృష్టం కొద్ది ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడని తెలిపాడు. 

న్యాయం కోసం వన్ ప్లస్ సర్వీస్ సెంటర్ ప్రతినిధులను ఆశ్రయించానని, 2,3 రోజుల తర్వాత సర్వీస్ సెంటర్ ప్రతినిధులు పేలిన స్మార్ట్ ఫోన్ ని కలెక్ట్ చేసుకున్నారే తప్పా ఏం చేయాలేదని తెలిపాడు. వర్మ వరుస ట్వీట్లకు వన్ ప్లస్ యాజమాన్యం స్పందించింది. మీ తమ్ముడు క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నామని తెలిపింది. మీరు మాకు డైరెక్ట్ గా మెసేజ్ చేయండి. వెంటనే సమస్యను పరిష్కరిస్తామని రిప్లయి ఇచ్చింది. 

Leave a Comment