రాయలసీమకు సముద్రం వచ్చేసింది.. ఏంటీ నమ్మడం లేదా?

ఇన్నాళ్లు రాయలసీమకు సముద్ర తీరం లేదు.. ఆప్పుడు ఆ బాధ తీరిపోయింది. ఇప్పటి వరకు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తొమ్మిది కోస్తా జిల్లాలకు మాత్రమే తీర ప్రాంతం ఉంది. రాయలసీమ జిల్లాలకు సముద్ర తీరం లేదు. అయితే పరిపాలన సౌలభ్యం కోసం ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాలను పెంచారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో రాయలసీమకు సముద్ర తీరం వచ్చింది..

ఎలా అంటే.. రాయలసీమలోని నాలుగు జిల్లాలను 8 జిల్లాలుగా చేశారు. అందులో తిరుపతి జిల్లాకు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో తీర ప్రాంతం ఉన్న సూళ్లురుపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని కలిపారు. దీంతోపాటు గూడురు కూడా తిరుపతిలో కలుస్తోంది.. సూళ్లురుపేట, గూడురులకు సముద్రం ఉంది. తిరుపతి రాయలసీమ జిల్లా కాబట్టి.. రాయలసీమకు కూడా సముద్రం వచ్చినట్లు అయ్యింది.. మరో విశేషం ఏంటంటే.. గుంటూరు జిల్లాకు ఇప్పటి వరకు సముద్ర తీరం ఉంది. అయితే జిల్లాల పునర్ వ్యవస్థీకరణతో సముద్ర తీర ప్రాంతం లేని జిల్లాగా గుంటూరు నిలుస్తోంది.. 

 

Leave a Comment