ఏపీ కేబినెట్ లో భారీ మార్పులు.. లిస్టులో కొత్త పేర్లు ఇవేనా?

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలో భారీ మార్పులు జరగనున్నాయి. కేబినెట్ లో కొత్తగా తీసుకునే వారి లిస్ట్ ని కూడా సీఎం జగన్ రెడీ చేసినట్లు సమాచారం.. ఈనెల 7న జరగనున్న కేబినెట్ భేటీలో కొత్త వారికి అవకాశం ఇచ్చే దానిపై చర్చించనున్నారు. అయితే ఈ కేబినెట్ లో కొంతమందిని కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఈనెల 11న కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.. మొత్తంమీద ఈనెల 7న కేబినెట్ విస్తరణపై పూర్తి క్లారిటీ రానుంది. 

కొనసాగించే అవకాశం ఉన్న మంత్రులు:

పెద్దిరెడ్డి రామ్ చంద్రారెడ్డి, బొత్స సత్యానారాయణతో పాటు గుమ్మనూరు జయరాం, చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణను కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. 

కొత్తగా వారి పేర్లు:

  • శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు, పాలకొండ ఎమ్మెల్యే కళావతి, పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి పేర్లు వినిపిస్తున్నాయి. ఇద్దరు మహిళల్లో ఒకరికి అవకాశం ఇస్తారని సమాచారం..
  • ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి కోలగట్ల వీరభద్రస్వామి, పీడిక రాజన్న దొర వినిపిస్తున్నాయి.
  • విశాఖ నుంచి గుడివాడ అమర్నాథ్ పేరు వినిపిస్తోంది. 
  • ప్రకాశం జిల్లా నుంచి బుర్రా మధుసూదన్ యాదవ్, సుధాకర్ బాబు పేర్లు వినిపిస్తున్నాయి.
  • నెల్లూరు జిల్లా నుంచి కాకాణి గోవర్థన్ తోపాటు దివంగత మంత్రి గౌతం రెడ్డి సమీమణి కీర్తిరెడ్డికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 
  • చిత్తూరు నుంచి ఆర్కే రోజా, శ్రీనివాసులు, ఎంఎస్ బాబు, ఆదిమూలం పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే పెద్ది రెడ్డిని కొనసాగిస్తున్నందున వీరిలో ఒక్కరికే అవకాశం దక్కుతుంది. 
  • కర్నూలు నుంచి హఫీజ్ ఖాన్, శిల్పా చక్రపాణిరెడ్డి, కంగాటి శ్రీదేవి పేర్లు వినిపిస్తున్నాయి. 
  • అనంతపురం నుంచి కాపు రామచంద్రరెడ్డి, ఉషాశ్రీచరణ్, జొన్నలగడ్డ పద్మావతి ఉన్నారు. 
  • కడప నుంచి శ్రీకాంత్ రెడ్డి, కోరుముట్ర శ్రీనివాసులు, మేడా మల్లికార్జున రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరికే అవకాశం వస్తుంది.
  • తూర్పు గోదావరి జిల్లా నుంచి దాడిశెట్టి రాజా, పొన్నాడ సతీష్, కొండేటి చిట్టిబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. 
  • పశ్చిగ గోదావరి జిల్లా నుంచి ముదునూరి ప్రసాద రాజు, గ్రంధి శ్రీనివాస్, బాలరాజు, ఎలీజా పేర్లు వినిపిస్తున్నాయి.  
  • కృష్ణా జిల్లా నుంచి పార్థసారధి, ఉదయభాను, దూలం నాగేశ్వరరావు పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరికి లేదా ఇద్దరికి ఛాన్స్ రావొచ్చు. 
  • గుంటూరు జిల్లా నుంచి విడదల రజనీ పేరు ఫైనల్ లిస్టులో ఉండే అవకాశాలు ఉన్నాయి.

 

Leave a Comment