10 నిమిషాల్లో కోవిడ్-19 ఫలితం 

ఏపీకి లక్ష ర్యాపిడ్ టెస్ట్ కిట్లు 

కోవిడ్‌ –19 నివారణా చర్యల కోసం ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. కోవిడ్‌ 19 పరీక్షల కోసం దక్షిణ కొరియానుంచి ర్యాపిడ్‌ టెస్టు కిట్లను తెప్పించింది. ఇవాళ  ఒక లక్ష ర్యాపిడ్‌ టెస్టు కిట్లను రాష్ట్ర ప్రభుత్వం అందుకుంది. క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం వైయస్‌.జగన్‌ ఈ కిట్లను ప్రారంభించారు. శాండర్‌ మెడికెయిడ్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌డైరెక్టర్‌ రాజీవ్‌ సింథీ, డైరెక్టర్‌ మురళీధర్‌ సీఎం శ్రీ జగన్‌కు కిట్లను అందించారు. 

తాజా ర్యాపిడ్‌ కిట్ల ద్వారా రాష్ట్రంలో కోవిడ్‌–19 పరీక్షలు ఊపందుకుంటున్నాయని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. వీటిని కమ్యూనిటీ టెస్టింగ్‌ కోసం వాడుతామని అధికారులు సీఎంకు వివరించారు. కేవలం 10 నిమిషాల వ్యవధిలో ఫలితం వస్తుందన్నారు. ప్రత్యేకంగా చార్టర్‌ విమానంలో దక్షిణ కొరియాలోని సియోల్‌ నుంచి దిగుమతి చేసుకున్నట్టుగా అధికారులు పేర్కొన్నారు. వీటి వినియోగంపై వైద్యులకు శిక్షణ ఇస్తున్నారు. మూడు నాలుగు రోజుల్లో ఈ కిట్లు జిల్లాలకు చేరుతాయని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి సీఎంకు వివరించారు. 

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 572కి చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన 35 మంది రోగులు డిశ్ఛార్జి అఅయ్యారు. కరోనా బారినపడి ఇప్పటి వరకు రాష్ట్రంలో 14 మంది మృతి చెందారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 523 మంది చికిత్స పొందుతున్నారు.

 

Leave a Comment