ఒమిక్రాన్ లక్షణాలు.. బట్టలు తడిసిపోతాయ్..!

ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను భయపెడుతోంది. మన దేశంలోనూ వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకు కేసులు సంఖ్య పెరుగుతోంది. మొన్నటి వరకు మారణహోమం సృష్టించిన డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ శరవేగంతో వ్యాప్తి చెందుతుందని నిపుణులు అంటున్నారు. 

కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఓ అంటువ్యాధిలా వేగంగా విస్తరిస్తుంది. మన దేశం చాలా పెద్ద దేశం కాబట్టి.. ఒక్కసారి వైరస్ ఎటాక్ అయితే చాలా వేగంగా ఎక్కువ మందికి సోకుతుంది. అయితే డెల్టా కంటే ఒమిక్రాన్ అంత ప్రమాదకరమైంది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే సరైన జాగ్రత్తలు పాటిస్తే వైరస్ నుంచి బయటపడవచ్చని అంటున్నారు. 

ఒమిక్రాన్ లక్షణాలు:

ఇక ఒమిక్రాన్ లక్షణాల గురించి ఒకసారి చూస్తే.. రాత్రి సమయంలో ఈ కొత్త వేరియంట్ చురుగ్గా ఉంటుంది. తీవ్ర మైన ఒళ్లు నొప్పులు ఉంటాయి. రాత్రి సమయంలో బాగా ఎక్కువగా చెమట పడుతుంది. కొంత మందిలో బట్టలు సైతం తడిసిపోయేలా చెమట పడుతుందని దక్షిణాఫ్రికా హెల్త్ డిపార్ట్ మెంట్ కు చెందిన డాక్టర్ ఉన్ బెన్ పిల్లే చెప్పారు. తీవ్ర మైన తలనొప్పి, స్వల్ప జ్వరం, అలసట, గొంతులో దురద వంటి లక్షణాలు కూడా కనిపించినట్లు తెలిపారు. ఇక వాసన కోల్పోవడం, ముక్కు కారడం వంటి లక్షణాలు మాత్రం ఒమిక్రాన్ బాధితుల్లో ఎక్కువగా కనిపించడం లేదని అన్నారు. పొడిదగ్గు, శ్వాసకోస సమస్యలు, రక్తంలోని ఆక్సీజన్ లెవల్స్ పడిపోవడం వంటివి జరిగితే వెంటనే టెస్టులు చేయించుకోవాలని సూచించారు. కరోనా నిబంధనలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.  

Leave a Comment