వామ్మో.. కిడ్నీలో 156 రాళ్లు..!

కిడ్నీలో రాళ్లు ఉంటే ఆ బాధ భరించలేనిది..కానీ ఓ వ్యక్తి కిడ్నీలో మాత్రం ఏకంగా 156 రాళ్లు ఉన్నాయి. అయితే ప్రీతి యూరాలజీ, కిడ్నీ ఆస్పత్రి వైద్యులు వీటిని ఆపరేషన్ చేయకుండానే ల్యాప్రోస్కోపీ, ఎండోస్కోపీలతో కీ హోల్ సర్జరీ నిర్వహించి తొలగించారు. ఇలాంటి ఆపరేషన్ చేయడం దేశంలోనే మొట్టమొదటిసారి ఇదే.. 

వివరాల మేరకు కర్ణాటకలోని హుబ్లికి చెందిన ఉపాధ్యాయుడు బసవరాజు కడుపు నొప్పితో బాధపడుతుండటంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో బసవరాజు కిడ్నీలో పెద్ద మొత్తంలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా కిడ్నీ మూత్రకోశం సమీపంలో ఉంటుంది. కానీ ఆయనకు అందుకు భిన్నంగా కడుపు దగ్గరలో ఉంది. దీనిని ఎక్టోపిక్ కిడ్నీ అంటారు. వైద్యులు కీహోల్ సర్జరీ విధానంలో ల్యాప్రోస్కోపి, ఎండోస్కోపీ పద్ధతుల ద్వారా 3 గంటలు శ్రమించి 156 రాళ్లు బయటకు తీశారు. రోగికి రెండేళ్ల ముందే రాళ్లు ఏర్పడి ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. 

 

Leave a Comment