కేంద్రం సంచలన నిర్ణయం.. అమ్మాయిల పెళ్లి వయసు ఇక 18- 21 ఏళ్లు..!

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమ్మాయిల కనీస పెళ్లి వయసు 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు బుధవారం అమోదించింది. 2020 స్వాతంత్య్ర దినోత్సవం ప్రసంగంలో ప్రధాని మోడీ అమ్మాయిల పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఏడాదిన్నర తర్వాత ఈ ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 

కేబినెట్ ఆమోదం తర్వాత ప్రభుత్వం బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 చట్ట సవరణ పార్లమెంట్ ముందుకు రానుంది. అదేసమయంలో ప్రత్యేక వివాహ చట్టం, హిందూ వివాహ చట్టం 1955 వంటి వ్యక్తిగత చట్టాలకు సవరణలు తీసుకురానుంది. ఆరోగ్య సమస్యలు, పోషకాహార లోపం నుంచి అమ్మాయిలను కాపాడేందుకు జయజైట్లీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ దేశవ్యాప్తంగా సర్వేలు చేపట్టి అభిప్రాయాలు సేకరించింది. 

అమ్మాయిలు తొలి సారి గర్భం దాల్చేనాటికి వారి వయసు కనీసం 21 ఏళ్లు ఉండాలిని సూచించింది. అమ్మాయిలకు 21 ఏళ్లకు పెళ్లి చేయడం అది ఆ కుటుంబంపై ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్య పరంగా సానుకూల ప్రభావం చూపుతుందని కమిటీ సూచించింది. ఈ ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపినట్లు తెలిసింది.. 

Leave a Comment