ఒమిక్రాన్ గురించి నమ్మలేని నిజాలు..పరిశోధనలో బయటపడిన కొత్త లక్షణం..!

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్  కరోనా వైరస్ ప్రజలను కంగారుపెట్టిస్తా ఉంది.ఈ వైరస్ నుంచి ఎలా బయటపడాలని అన్ని దేశాలు శాస్త్రవేత్తలు, నిపుణులు ప్రయత్నాలు ముమ్మరము చేస్తున్నారు. ఈ సమయములో కొత్త కొత్త రకాల అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే వచ్చిన కరోనా వేరియంట్లు అన్నింటిలో కంటే కూడా ఈ ఒమిక్రాన్ వేరియంట్ ఎక్కువ వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపి చెందుతుంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెపుతుంది. ప్రజలు నిర్లక్ష్యంగా ఉండడం మరియు ఈ వైరస్ ని తేలికగా తీసుకోవడము వల్ల  ఒమిక్రాన్ మరింత వేగంగా పెరగడానికి దోహదపతుంది అని నిపుణులు ఆందోళన వ్యక్తం చేసారు. 

ఈ క్రమంలో కరోనాకు సంబంధించి ఎలాంటి లక్షణాలు  కనిపించినా కూడా ఆలస్యము చెయ్యకుడదు అని హెచ్చరిస్తున్నారు.మన దేశంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య రోజు రోజుకి ఆందోళన తెప్పిస్తుంది. తక్కువ  లక్షణాలు ఉన్న మరి ఎక్కువ వేగంగా వృధి చెందుతుంది. వ్యాక్సిన్ తీసుకున్న వారిని కూడా ఈ వైరస్ విడిచిపెట్టడం లేదు. తేలికపాటి లక్షణాలు ఉన్నప్పటికీ ఇది ప్రజలకు హాని కలిగిస్తుంది. ఇటీవల స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని నిపుణుల బృందం ఒమిక్రాన్‌కి సంబంధించి కొత్త లక్షణాన్ని కనుగొంది.

ఒమిక్రాన్ లక్షణాలు చూసే దానికి తక్కువగా ఉంటుంది. కానీ ఇది మనిషి శరీరము మీద ఎక్కువ ప్రభావము చూపతుంది. కళ్ళ దగ్గర  నుంచి గుండె, మెదడు వరకు అనేక శరీర భాగాలను ప్రభావితం చేస్తుంది ఈ మహమ్మారి వైరస్. తాజాగా చెవులపై కూడా ప్రభావం చూపుతున్నట్లు తేలింది. ఒమిక్రాన్ శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడానికి స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని నిపుణులు కరోనా పేషెంట్లపై పరిశోధన చేశారు. ఈ పరిశోధనలో భాగంగా ఒమిక్రాన్ రోగుల అంతర్గత చెవి నమూనాలను బాగా పరీక్షించారు. 

రోగులు చెవి నొప్పి, లోపల జలదరింపులకు సంబంధించిన సమస్యల గురించి ఫిర్యాదు చేస్తున్నారని తెలుసుకున్నారు.మీరు చెవినొప్పి, రింగింగ్, విజిల్ లాంటివి సమస్యలను  ఎదుర్కొంటున్నట్ల అయితే కరోనా టెస్ట్‌ తప్పకుండా చేయించుకోవాల్సిందే. ఎందుకంటే ఒమిక్రాన్ పేషెంట్లలో చెవికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. అంతేకాదు ఇది ఎక్కువగా టీకాలు వేసిన రోగులలో కనిపించడం ఆశ్చర్యం మరియు భయాన్ని  కలిగిస్తుంది. 

ధ్వని, వినికిడి సమస్యలు ఉన్నట్లు అయితే ఎంత వీలైతే అంత తొందరగా డాక్టర్‌ని సంప్రదిస్తే మంచిదని సూచిస్తున్నారు. ఎందువలన అంటే ఆలస్యము ఇన్ఫెక్షన్ వినికిడి శక్తిని తగ్గించి లోపానికి దరితిస్తుంది అని నిపుణులు అభిప్రాయ పడ్డారు. సాధారణంగా ఒమిక్రాన్ లక్షణాలు ఏమిటో కొన్ని మీఅందరి కోసము నిపుణులు ప్రకారము కింది విధముగా వున్నాయి చలి, గొంతు బొంగురు, శరీర నొప్పులు, బలహీనత, వాంతులు, రాత్రి చెమటలు, తేలికపాటి నుంచి తీవ్రమైన జ్వరం, దగ్గు, జలుబు, అలసట, తలనొప్పి ఉంటాయి.

 

Leave a Comment