క్లాత్ మాస్కులు వాడేవారికి అలర్ట్..నిపుణుల హెచ్చరిక..!

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్  ఇన్‌ఫెక్షన్‌లు మరియు ఒమిక్రాన్  కేసులు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. చాలా దేశాలు దీన్ని తగ్గించడానికి కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. అయినా కూడా ఒమిక్రాన్ భయం మాత్రం ప్రజల్ని వెంటాడుతూనే ఉంది.ఈ సమయములో చాలా మంది క్లాత్ మాస్కులు వాడుతున్నారు.ఈ మాస్కులు వల్ల వైరస్ వ్యాప్తి తగ్గదు.కొందరు బట్టతో తయారు చేసే మాస్క్‌లను వాడటమే కాకుండా వాటిని ఉతికి తిరిగి మళ్లీ వాడుతున్నారు. కానీ వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని స్పష్టం చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు కన్న అగ్రరాజ్యంగా పేరు తెచ్చు కొన్న అమెరికా కూడా ఈ కోవిడ్ మరియు ఒమిక్రాన్ దెబ్బకి భయబ్రాంతులు చెందుతున్నాయి.ఈ నేపథ్యములో అందరు తగ్గినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని అమెరికా ప్రభుత్వం ప్రజలను ముందు జాగ్రత పరుస్తుంది. USలోని ప్రజారోగ్య అధికారులు కూడా ఈ విషయము మీద ప్రజలను హెచ్చరించారు. క్లాత్‌ మాస్కులు ఎవ్వరూ వాడొద్దని కచ్చితంగా N95 మాస్కులను ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికి గల కారణాలను కూడా వారు అందరికి అర్థము అయ్యిలాగా వివరించారు. 

2020వ సంవత్సరంలో కరోనా కేసులు కొంతకాలం తక్కువ అవడము చూసి క్లాత్‌ మాస్కులు వాడవచ్చని అప్పుడు చెప్పారు. కానీ గత కొన్ని రోజులుగా కరోనా కొత్త వేరియెంట్ ఓమిక్రాన్ వేగంగా వృధి చెందుతుంది. క్లాత్‌ మాస్కులు వేసుకోవడము వల్ల ఏ ఉపయోగము లేదు అని నిపుణులు అంటున్నారు అంతేకాకుండా వైరస్‌ని అడ్డుకోలేకపోతున్నాయని చెప్పారు. 

ఈ మాస్కులు విషయమ మీద తులేన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో పరిశోధనలు జరిపిన తర్వాత ఆ యూనివర్సిటీకి చెందిన మైక్రోబయాలజిస్ట్ చాడ్ రాయ్ ఈ విధంగా చెప్పారు. గాలి ద్వారా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్‌ని క్లాత్ మాస్కులు,మరియు సర్జికల్ మాస్కులు ఆపలేవు అని  చెప్పారు. అయినప్పటికీ వైరస్ నుంచి రక్షింపబడుతున్నారనే ఉద్దేశ్యంతో క్లాత్ మాస్కులు ధరిస్తే ఆరోగ్యం పరంగా చాలా నష్టపోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. క్లాత్ మాస్కులను వాడటము తగ్గించి అందరు తప్పనిసరిగా  N95 మాస్కులను ఉయోగించాలి అని ఆయన చెప్పారు.

2015వ సంవత్సరంలో కరోనా మహమ్మారి రాకముందు,వ్యాప్తి కాకముందు ఆస్ట్రేలియా, వియత్నాం,చైనా వంటి దేశాల్లో శాస్త్రవేత్తలు,నిపుణులు శ్వాసకోశ ఇన్ఫెక్షన్ నుంచి మరియు రక్షణగా క్లాత్ మాస్కులు ధరించారు అని అందరికి తెలిసిందే ఆ తర్వాత ఇవి ఇన్‌ఫెక్షన్‌ని అధిక మోతాదులో పెంచాయి అని తెలుసుకున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో N95 మీకు ద్విదిశాత్మక పద్ధతిలో రక్షణను ఇస్తుంది. అందుకే అమెరికా అధ్యక్షుడు అయిన జో బిడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్థానికముగా ఫార్మసీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లని ఉపయోగించి 400 మిలియన్ల ఉచిత N95 మాస్కులను పంపిణీ చేయాలన్నారు.

 

Leave a Comment