కేంద్ర బడ్జెట్ 2022 : ఏడాదిలో 80 లక్షల ఇళ్ల నిర్మాణం..!

పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నాలుగో సారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ సుమారు గంటన్నరపాటు ప్రసంగించారు. పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తామని ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారు. పీఎం ఆవాస్ యోజన కింద 2022-23 ఏడాదిలో 80 లక్షల ఇళ్లను నిర్మిస్తామన్నారు. ఇందు కోసం బడ్జెట్ లో రూ.44 వేల కోట్లు కేటాయించారు. 

ఆర్థికంగా వెనుకబడిన వారు, పట్టణ ప్రాంతాల్లో ఉంటున్న మధ్య తరగతి కుటుంబాలకు ఈ బడ్జెట్ ఎంతగానో ఉపయోగపడుతుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అర్హత ఉన్న లబ్ధిదారులకు పీఎం ఆవాజ్ యోజన కింద ఈ ఇళ్లను అందిస్తామని వెల్లడించారు. దీంతో ఎంతో మంది సొంతింటి కల సాకారం అవుతుందని ఆర్థిక మంత్రి తెలిపారు.  

 

Leave a Comment